
Virupaksha’ movie leaked : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విరూపాక్ష’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.సుకుమార్ కథ , స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి కార్తీక్ దండు అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించాడు.
ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే స్క్రీన్ ప్లే, హారర్ జానర్ మీద తెరకెక్కించిన ఈ సినిమాకి సెన్సార్ రిపోర్ట్ కూడా అదిరిపోయింది.ఈమధ్యనే రెండు తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, పర్వాలేదు అనే రేంజ్ బుకింగ్స్ ట్రెండ్ ని కొనసాగిస్తుంది.విడుదల తర్వాత టాక్ అద్భుతం గా వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఓపెనింగ్స్ దగ్గర నుండే ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ ట్విస్ట్ సోషల్ మీడియా లో లీక్ అయిపోయింది.ఇందులో విలన్ మరెవరో కాదు, హీరోయిన్ సంయుక్త మీనన్ అట. చివరి వరకు ఈ విషయం చూసే ప్రేక్షకుడికి అర్థం అవ్వదట. క్లైమాక్స్ లో ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో ఈ ట్విస్ట్ బయటపడుతుంది అట. ట్రైలర్ చూస్తున్నపుడే డైరెక్టర్ హీరోయిన్ యే విలన్ అనిపించేలా చిన్న హింట్ ఇచ్చాడు.
ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన ఇన్సైడ్ సమాచారం ప్రకారం హీరోయిన్ మెయిన్ విలన్ అనే విషయం బయటపడింది. మరి దీనిని ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి.ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు A సరిఫికేట్ ని జారీ చేసారు.హారర్ కథాంశం తో తెరకెక్కిన సినిమా అవ్వడం వల్లే ఈ సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు పాజిటివ్ వైబ్రేషన్స్ ని రప్పించిన ఈ చిత్రం విడుదల తర్వాత కూడా అదే పాజిటివ్ వేవ్ ని కొనసాగిస్తుందో లేదో చూడాలి.