Tamannaah: తమన్నా గ్లామర్ డోస్ ఓవర్ అవుతుంది. ఎన్నడూ లేనివిధంగా మిల్కీ బ్యూటీ తెగిస్తుంది. బ్లూ కలర్ బాడీకాన్ డ్రెస్ ధరించి తమన్నా బోల్డ్ క్లీవేజ్ షోతో మైండ్ బ్లాక్ చేసింది. సన్ననైన పీలికలు అడ్డుపెట్టి యద భాగం దాచింది. తమన్నా తన హాట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. అందాలతో చంపేయకు తమన్నా అంటూ వేడుకుంటున్నారు. తమన్నా ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

ఎల్లే మ్యాగజైన్ 2022 కోసం తమన్నా ఈ ఫోటో షూట్ చేశారు. ఆమె ఆల్ట్రా స్టైలిష్ మోడ్రన్ లుక్ మెస్మరైజ్ చేస్తుంది. ఇక లాంగ్ కెరీర్ ఎంజాయ్ చేసిన స్టార్ హీరోయిన్స్ లో తమన్నా ఒకరు. హీరోయిన్స్ కమర్షియల్ చిత్రాల గ్లామర్ డాల్స్ గా మారిపోయాక ఎక్కువ కాలం పరిశ్రమలో ఉండటం లేదు. ఐదేళ్లు ఫార్మ్ లో ఉండటం కష్టంగా ఉంది. అలాంటిది తమన్నా 2005 నుండి చిత్ర పరిశ్రమలో సత్తా చాటుతుంది.
ఇక దర్శకుడు శేఖర్ కమ్ముల తమన్నాకు బ్రేక్ ఇచ్చాడు. ఆయన తెరకెక్కించిన హ్యాపీడేస్ భారీ విజయం అందుకుంది. ఆ చిత్ర హీరోయిన్ గా తమన్నా మొదటిసారి ప్రేక్షకుల దృష్టిలో పడ్డారు. ఇక 100% లవ్ మూవీతో స్టార్ డమ్ తెచ్చుకున్నారు. సుదీర్ఘ కెరీర్లో తమన్నా ఆల్మోస్ట్ అందరు స్టార్ హీరోలను కవర్ చేసింది. సీనియర్ సూపర్ స్టార్స్ చిరంజీవి, వెంకటేష్ లతో కూడా జత కట్టిన ఘనత తమన్నా సొంతం.

తమన్నా వయసు 30 ఏళ్ళు దాటగా తరచూ పెళ్లి వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఆ మధ్య ముంబైకి చెందిన వ్యాపారవేత్తను తమన్నా వివాహం చేసుకోబోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను తమన్నా తనదైన శైలిలో ఖండించారు. నిరాధార పుకార్లు ప్రచారం చేయవద్దు. పెళ్లి కుదిరినప్పుడు ఖచ్చితంగా చెప్తానంటూ అసహనం వ్యక్తం చేశారు.

గత ఏడాది తెలుగులో తమన్నా నటించిన ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం చిత్రాలు విడుదలయ్యాయి. గని మూవీలో స్పెషల్ సాంగ్ చేశారు. ప్రస్తుతం ఆమె చిరంజీవికి జంటగా భోళా శంకర్ చిత్రం చేస్తున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ వేదాళం రీమేక్ అని సమాచారం. భోళా శంకర్ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలు పాత్ర చేయడం విశేషం. అలాగే ఓ మలయాళ, హిందీ చిత్రంలో తమన్నా నటిస్తున్నారు.