నటీనటులు : సుమంత్ ప్రభాస్ , మణి ఎగుర్ల , మౌర్య చౌదరి , సార్య,సిరి రాశి, అంజి మామ, మురళి ధర గౌడ్ తదితరులు
దర్శకుడు : సుమంత్ ప్రభాస్
సంగీతం : కళ్యాణ్ నాయక్
సినిమాటోగ్రఫీ : శ్యామ్
ఎడిటర్ : సృజన
నిర్మాతలు : అనురాగ్ రెడ్డి , శరత్ , చంద్రు మనోహరన్
ఈ సమ్మర్ లో భారీ హంగులతో వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టి బయ్యర్స్ కి భారీ నష్టాలను కలిగించాయి, కానీ చిన్న సినిమాలుగా విడుదలైన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించాయి. రీసెంట్ టైం లో అలా చిన్న సినిమా పై విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసిన చిత్రం ‘మేము ఫేమస్’. సుమంత్ ప్రభాస్ అనే కొత్త కుర్రాడు హీరో గా నటిస్తూ దర్శకత్వం కూడా వహించిన ఈ చిత్రం , విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ఆడియన్స్ లో ఆసక్తి ని రేపింది. నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా ట్వీట్ వెయ్యడం తో అంచనాలు అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయాయి. విడుదలకు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరో ఒక సినిమా గురించి ఇలాంటి ట్వీట్ వేసాడంటే కచ్చితంగా చిత్రం లో విషయం ఉందని చాలా మంది నమ్మారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగా జరిగాయి. ఈరోజు గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూద్దాము.
కథ :
మహి, బాలీ , దుర్గ (సుమంత్ ప్రభాస్ , మణి, మౌర్య) అనే ముగ్గురు స్నేహితులు చిన్న తనం నుండి కలిసి మెలిసి పెరిగిన ఈ ముగ్గురు ఎలాంటి బాధ్యతలు లేకుండా అల్లరి చిల్లరగా ఊరు మొత్తం గాలి తిరుగుడు తిరుగుతూ ఉంటారు. అయితే మహి మేనమామ (మురళీధర్ ) కూతురు మౌనిక (సిరి) ని ప్రేమిస్తాడు. బబ్బి(సార్య) అనే అమ్మాయిని బాలి ప్రేమిస్తాడు. అయితే ఊర్లో ఈ ముగ్గురు స్నేహితులకు ఎదురైనా కొన్ని సంఘటనల కారణంగా, ఎదో ఒకపని ప్రారంభించాలి అనే సంకల్పం తో ఒక టెంట్ హౌస్ ని ప్రారంభిస్తారు. అయితే ఆ టెంట్ హౌస్ వల్ల కొన్ని సమస్యలు ఎదురు అవుతాయి. వాటిని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ ముగ్గురు ఎలా అధిగమించారు..?, మధ్యలో ఎదురైనా పరిస్థితులు ఏమిటి అనేది వెండితెర మీద చూడాల్సిందే.
విశ్లేషణ :
నటుడిగా , రచయితగా మరియు దర్శకుడిగా సుమంత్ ప్రభాస్ ఎంతో నిజాయితీగా ప్రేక్షకులకు వినోదం పంచడం లో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ మరియు అక్కడక్కడా ఎమోషనల్ సీన్స్ తో చాలా చక్కగా తీసాడు అనే అనుభూతిని ప్రతీ ఒక్కరిలో కలిపించాడు సుమంత్ ప్రభాస్. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన ప్రతీ క్యారక్టర్ నుండి పెర్ఫార్మన్స్ రాబట్టాడు, అవి వెండితెర మీద పేలాయి. ఫలితంగా సెకండ్ ఏమి జరగబోతుంది అనే ఆత్రుతని ప్రేక్షకుల్లో కలిగించడం లో సక్సెస్ అయ్యాడు సుమంత్ ప్రభాస్. ఇక సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ పెద్దగా ఏమి ఉండదు అనే విషయం అందరికీ అర్థం అయిపోతుంది. స్క్రీన్ ప్లే నడిపించాలంటే కేవలం సుమంత్ ప్రభాస్ లాంటి వాళ్ళకే కాదు, పెద్ద డైరెక్టర్స్ కూడా ల్యాగ్ చెయ్యక తప్పదు. అలా ఒక 15 నిముషాలు బాగా ల్యాగ్ చేసినట్టు అనిపించింది.
కానీ సెకండ్ హాఫ్ లో లిప్ స్టిక్ సన్నివేశం, మహి మరియు మౌనిక మధ్య వచ్చే కళ్ళు సన్నివేశాలు ప్రేక్షకులకు కాస్త ఉపశమనం కలిగిస్తుంది. సెకండ్ హాఫ్ కి ఇవే హైలైట్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా పెద్ద కథ లేకుండా సింపుల్ గా సాగిపోయే తెలంగాణ నేటివిటీ కి తగ్గ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ మేము ఫేమస్ అనే చిత్రం నిలిచింది. ఇక ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణ, రీ రికార్డింగ్ అద్భుతంగా చేసాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ని చాలా సన్నివేశాలను ఆయన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాపాడింది అని చెప్పొచ్చు. ఇక శ్యామ్ అందించిన సినిమాటోగ్రఫీ ని చూస్తే ఒక పల్లెటూరిలో మనం ఉన్నామనే అనుభూతిని కలిగించింది. అలా 50 మంది కొత్తవారితో తెరకెక్కించిన ఈ సినిమా గొప్ప ప్రయత్నం అనే చెప్పాలి. ఈ సమ్మర్ కి కమర్షియల్ గా ఈ చిత్రం సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ.
చివరి మాట :
ఎలాంటి లాజిక్స్ మరియు మ్యాజిక్స్ ఆశించకుండా ఈ చిత్రానికి వెళ్తే ఒక రెండు గంటల పాటు మంచి టైం పాస్ అయ్యే సినిమాగా నిలుస్తుంది.ఈ వీకెండ్ కి సరదాగా మీ స్నేహితులతో కలిసి ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు .
రేటింగ్ : 2.75 /5