Homeఎంటర్టైన్మెంట్Meher Ramesh Daughter Engagement: గ్రాండ్ గా జరిగిన మెహర్ రమేష్ కూతురు నిశ్చితార్థం.. వీడియో...

Meher Ramesh Daughter Engagement: గ్రాండ్ గా జరిగిన మెహర్ రమేష్ కూతురు నిశ్చితార్థం.. వీడియో వైరల్..

Meher Ramesh Daughter Engagement: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె మెహన కి నిన్న అనిరుద్ అనే వ్యక్తితో హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ గా నిశ్చితార్ధ వేడుక జరిగింది. అందుకు సంబంధించిన ఫోట్లోలు , వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ వార్త బయటకు వచ్చేంత వరకు మెహర్ రమేష్ కి ఇంత పెద్ద కూతురు ఉందనే విషయం ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. ఈ నిశ్చితార్ధ వేడుకకు టాలీవుడ్ కి చెందిన కొందరు సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా, రాజకీయ నాయకులూ , వ్యాపారవేత్తలు కూడా హాజరయ్యారు. ఇక మెహర్ రమేష్ కూతురు మెహన ఫోటోలను చూడగానే , అచ్చు గుద్దినట్టు నాన్న పోలికలతో ఉందని, సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటోలను మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

ఇక మెహర్ రమేష్ సినిమాల విషయానికి వస్తే , ప్రస్తుతం ఈయనతో సినిమాలు చేసేందుకు ఏ హీరో ముందుకు రావడం లేదు. నిర్మాతలు అయితే మెహర్ రమేష్ పేరు చెప్తేనే పరుగులు తీసే పరిస్థితి. అలాంటి డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందించాడు మరి. ఆయన గత చిత్రం ‘భోళా శంకర్’. మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఈ సినిమా , ఎంతటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదటి రోజే 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న చిరంజీవి, ఈ సినిమాతో క్లోజింగ్ లో కూడా అంతటి కలెక్షన్స్ ని రాబట్టలేకపోయాడు. ఈ చిత్రానికి ముందు మెహర్ రమేష్ తీసిన శక్తి , షాడో, కంత్రి వంటి సినిమాలు ఒక దానిని మించి ఒకటి ఎంతటి డిజాస్టర్స్ గా నిలిచాయో మన అందరికీ తెలిసిందే. కెరీర్ మొత్తం ఈయన తీసిన సినిమాల్లో పర్వాలేదు అనిపించుకుంది బిల్లా మాత్రమే. ప్రభాస్ హీరో గా నటించిన ఈ సినిమా ఆరోజల్లో యావరేజ్ గా ఆడింది.

మెగా ఫ్యామిలీ తో బంధుత్వం ఉండడంతో , ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోతోనే సినిమా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ బాధ పడాల్సిన విషయం ఏమిటంటే , మెగా హీరోలు కనీసం స్టోరీ వినేందుకు కూడా ఈయనకు సమయం ఇవ్వడం లేదట. మరి ఆ రేంజ్ లో బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న మెహర్ రమేష్ భవిష్యత్తులో సినిమాలు చేస్తాడా ?, లేదంటే సినిమాలు మానేసి వేరే ఏదైనా వ్యాపారం చూసుకుంటాడా అనేది చూడాలి . కానీ ఏది ఏమైనా ఒక డైరెక్టర్ గా ఆయన కెరీర్ లో ఫెయిల్ అయ్యుండొచ్చు కానీ, వ్యక్తిగా , ఒక తండ్రిగా మాత్రం సక్సెస్ అయ్యాడు. తన కూతురికి గొప్ప సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తున్నాడు. ఇంతకు మించి ఒక మనిషి జీవితం లో సాధించాల్సింది ఏముంది చెప్పండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version