Megastar Chiranjeevi: అభిమానులే తన మెగా బలం అని నమ్ముతారు చిరంజీవి. తాజాగా, ఓ వీరాభిమాని కుమార్తె పెళ్లికి ఆర్థికసాయం చేశారు. రాజాం కొండలరావు కి చిరంజీవి అంటే విపరీతమైన అభిమానం. కొండలరావు కుమార్తె నీలవేణికి ఇటీవల పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలిసిన చిరంజీవి.. తన అభిమాని కుమార్తె వివాహానికి మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదం పంపారు. ఈ నెల 10వ తేదీన జరగనున్న వివాహానికి కానుకగా అభిమాని ఖాతాలో రూ.లక్ష జమ చేశారు.

పైగా ట్విటర్ ద్వారా పెళ్లి కుమార్తెకు ఆశీస్సులు తెలియజేశారు. దీనిపై శ్రీకాకుళం జిల్లా రాజాం పరిధిలోని కొండంపేటకు చెందిన అభిమాని కొండల్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అండగా నిలవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తన వీరాభిమాని కుమార్తె పెళ్లికి చిరంజీవి ఆర్థికసాయం చేయడం గొప్ప విషయం.
Also Read: ముదిరిన హిజాబ్ లొల్లి.. స్కూళ్లు , కాలేజీలు మూసివేత.. మత ఘర్షణలు చేయిదాటుతోందా?
ఇక మెగాస్టార్ చిరంజీవితో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల ఓ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్‌గా శృతిహాసన్ ఇప్పటికే ఖరారైనట్లు వార్తలు రాగా.. తాజాగా మాళవిక మోహనన్ పేరును యూనిట్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ ప్రస్తుతం ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలతో బిజీగా ఉండగా.. బాబీ డైరెక్షన్‌లో మూవీ తర్వాత వెంకీ కుడుముల ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశముంది.

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరు ఆచార్య సినిమా చేస్తున్నాడు. కాగా రీసెంట్ గా చిరంజీవి మరోసారి కరోనా బారిన పడి కోలుకున్నారు. అయితే, ఈ మధ్యలో ఎంతో కొంత మేర చిరంజీవి కారణం ఆచార్య పనులు వాయిదా పడతాయి.
Also Read: కమ్యూనిస్టులకు ప్రజాసమస్యలు పట్టవా? టీచర్లపైనే మక్కువ ఎందుకో?