Megastar Shocking Review On RRR: తెలుగు వెండితెరపైనే బలమైన నేపథ్యం ఉన్న రెండు సినీ కుటుంబాల వారసులు కలిసి నటించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇద్దరి హీరోలకూ భారీ మాస్ ఇమేజ్ ఉంది. అందుకే.. ఈ సినిమా విడుదలై రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే పలుచోట్ల ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసింది ‘ఆర్ఆర్ఆర్’ . రాజమౌళి బృందం రికార్డు స్థాయి సక్సెస్ సాధించడం పై అభిమానులు, ప్రముఖులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ… చిత్ర యూనిట్ కు విషెస్ తెలియజేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ చిత్రం ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మెగాస్టార్ మాటల్లో.. ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్లలోనే కాదు, ప్రేక్షకుల గుండెల్లో కూడా దుమ్మురేపుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సృష్టిస్తున్న భారీ విజయాల గురించి వింటూ ఉన్నాను. రాజమౌళి వండర్ ఫుల్ విజన్ కి ఈ విజయం ఒక నిదర్శనం.
మెగాస్టార్ ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఇంకా మాట్లాడుతూ.. ‘బాయ్స్ ఇద్దరూ (ఎన్టీఆర్ – చరణ్) పోటీ పడి నటించారు. వాళ్ళిద్దర్నీ ఒకే ఫ్రేమ్ లో చూస్తుంటే.. నాకే అసూయ కలిగింది. తారక్.. నీ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. మై బాయ్ చరణ్ చించేశాడు. ఈ సినిమా ఇంత గొప్ప విజయాన్ని అందుకుంటుంది అని నేను ముందే ఊహించాను. అయినా ఫ్యాన్స్ కి కావలసింది ఇది కదా. రాజమౌళి విధ్వంసం సృష్టించాడు’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా గురించి చెప్పుకొచ్చాడు.

ఏది ఏమైనా ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. తెలంగాణలో ఆల్ టైమ్ రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. అదే విధంగా వరల్డ్ వైడ్ గా ఎన్టీఆర్ – చరణ్ తమ పవరేంటో సినిమా వసూళ్ల ద్వారా ఘనంగా నిరూపించారు. ఈ సినిమా భారీ విజయంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా పండుగ చేసుకుంటున్నారు. మరి ముందు ముందు ‘ఆర్ఆర్ఆర్’ ఇక ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.
Also Read: RRR Movie Box Office Collection Worldwide: అఫీషియల్ : ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలివే