Homeఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi OTT Web Series: ఓటీటీ వెబ్ సిరీస్ లో మెగాస్టార్ చిరంజీవి..డైరెక్టర్ ఎవరో...

Megastar Chiranjeevi OTT Web Series: ఓటీటీ వెబ్ సిరీస్ లో మెగాస్టార్ చిరంజీవి..డైరెక్టర్ ఎవరో తెలిస్తే మెంటలెక్కిపోతారు!

Megastar Chiranjeevi OTT Web Series: నాలుగు దశాబ్దాల నుండి సినీ అభిమానులను ఒక రేంజ్ లో అలరిస్తూ, ఇప్పటికీ ఆల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. కమర్షియల్ సినిమాకు సరికొత్త అర్హం చెప్పిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన రాక కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఒక ప్రభంజనం. చిరంజీవి వచ్చిన తర్వాతే ఇండియా మొత్తం మీద కమర్షియల్ సినిమా ఫార్మాట్ మారిపోయింది. డ్యాన్స్ లో వేగం పెరిగింది, ఫైట్స్ వేరే లెవెల్ కి వెళ్లాయి. చిరంజీవి డ్యాన్స్, ఫైట్స్ ని చూసి ఇతర ఇండస్ట్రీ కి చెందిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కాపీ కొట్టి పెద్ద స్టార్స్ అయిపోయారు. ఆ స్థాయి ప్రభంజనం మెగాస్టార్ చిరంజీవి.

అలాంటి మెగాస్టార్ ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఆయన అమెజాన్ ప్రైమ్ వీడియో తెరకెక్కించే వెబ్ సిరీస్ లో హీరో గా నటించబోతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ వెబ్ సిరీస్ కి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మనం, 24 , ఇష్క్ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన విక్రమ్, అమెజాన్ ప్రైమ్ లో ‘దూత’ అనే వెబ్ సిరీస్ ని తెరకెక్కించాడు. నాగ చైతన్య హీరో గా నటించిన ఈ వెబ్ సిరీస్ 2024 లో విడుదలై పెద్ద హిట్ అయ్యింది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న నాగ చైతన్య ని సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కించింది ఈ వెబ్ సిరీస్. ఇప్పుడు త్వరలోనే ఆ సిరీస్ కి సీక్వెల్ చేయబోతున్నారు. ఇది పూర్తి అయ్యాక, మెగాస్టార్ చిరంజీవి తో చేయబోయే వెబ్ సిరీస్ ని మొదలు పెట్టబోతున్నాడని సమాచారం.

ఈ వెబ్ సిరీస్ తెలుగు తో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా తెరకెక్కుతుంది అట. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం తో ఇండస్ట్రీ హిట్ ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, ప్రస్తుతం తన ద్రుష్టి మొత్తాన్ని డైరెక్టర్ బాబీ తో చెయ్యబోయే సినిమా మీదనే పెట్టాడు. ఉగాది నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత ఆయన ‘దసరా’, ‘ది ప్యారడైజ్’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల తో ఒక భారీ యాక్షన్ సినిమా చేయనున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి అయిన తర్వాతే వెబ్ సిరీస్ పై ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version