Mega 154: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. యంగ్ హీరో లకు ఏ మాత్రం తగ్గకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నారు చిరు. ఇప్పటికే ఆచార్యసినిమాను పూర్తి చేసిన చిరు… గాడ్‌ఫాదర్, భోళా శంకర్ సినిమాల్లో నటిస్తూ.. షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ మేరకు చిరంజీవి సెట్స్‌కు వచ్చి షూటింగ్‌లో పాల్గొన్నారంట. ఈ సందర్భంగా డైరెక్టర్ కె.ఎస్. రవీంద్ర సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

కె.ఎస్. రవీంద్ర దర్శకుడు కాక ముందు… స్టూడెంట్‌గా ఉన్న రోజుల్లో నుంచి మెగాస్టార్ కి వీరాభిమాని అని అందరికీ తెలిసిందే. చిరంజీవి సినిమాలు విడుదల అయినప్పుడు కటౌట్లు, ఆయన వచ్చినప్పుడు ర్యాలీల్లో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు బాబీ. ఈ సినిమాతో పూనకాలు లోడ్ అవుతాయని గట్టిగా చెబుతున్నారు. ఇక ఆ పోస్ట్ లో “ఈ రోజు చాలా థ్రిల్లింగ్ డే అని చెప్పాలి. నెర్వస్‌గా ఉంది. అదే సమయంలో ఉత్సాహం గానూ ఉంది. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవిగారు మాతో ఫస్ట్ డే షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రయాణానికి ఇది గొప్ప ప్రారంభం. మీ అందరి ఆశీస్సులు కావాలి” అని బాబీ ట్వీట్ చేశారు. కాగా ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘మెగా 154’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
It's Quite a Thrilling day!!
Nervous and Enthusiastic at the same time..As our Mega Star @KChiruTweets garu joins the first day of shoot with us ❤️
Great start to this Most awaited journey.
Need all your blessings 🤗#Mega154 #PoonakaaluLoading 🤙 @ThisIsDSP @MythriOfficial pic.twitter.com/CJ5vEDkSXc— Bobby (@dirbobby) December 2, 2021