Megastar Chiranjeevi : ఫేడ్ అవుట్ డైరెక్టర్ మెహర్ రమేష్ పై మెగాస్టార్ చిరంజీవి సీరియస్ అయినట్టు తెలుస్తోంది. కారణం ఓవర్ బడ్జెట్.. వీరి కాంబినేషన్ లో ‘వేదాళం’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘భోళా శంకర్’ అనే టైటిల్ ను కూడా సగర్వంగా అనౌన్స్ చేశారు. అయితే, ఈ సినిమాకి సంబంధించి ఒక బ్యాంక్ సెట్ కావాలి. ఆ సెట్ లో భారీ ఫైట్ ఉంటుంది.

అయితే, ఈ సెట్ నిర్మాణం విషయంలో మెహర్ రమేష్ అత్యుత్సాహం చూపించి.. అనవసరమైన ఖర్చు పెట్టించారని.. అది మెగాస్టార్ నచ్చక.. చిన్నపాటి క్లాస్ తీసుకున్నాడని.. సినిమాలో ఎక్కడా ఓవర్ బడ్జెట్ చెయ్యొద్దు అని చిరు సూచించాడట. ఐతే, మెహర్ రమేష్ అంటేనే భారీ సినిమాల డైరెక్టర్. చిన్న ఫైట్ సీక్వెన్స్ ను కూడా భారీగా ఖర్చు పెట్టి తీస్తేనే మెహర్ కి నచ్చుతుంది.
అందుకే అలవాటులో పొరపాటుగా మెగాస్టార్ సినిమాకి కూడా అక్కడక్కడ ఓవర్ గా ఖర్చు పెట్టిస్తూ ముందుకు పోతున్నాడు. కానీ చిరుకి ఓవర్ బడ్జెట్ లు నచ్చవు. తక్కువలో తీసి ఎక్కువ లాభాలు వస్తేనే నిర్మాతకు, సినిమా ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని చిరు భావిస్తారు. ఇవ్వన్నీ ఛాన్స్ ఇచ్చేముందు ఆలోచించుకోవాలి. అయినా మెహర్ రమేష్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం దాదాపు నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాడు.
మెగాస్టార్ కి స్క్రిప్ట్ బాగా నచ్చింది కాబట్టే.. సినిమా తీసి పదేళ్లు అవుతున్నా.. మెహర్ రమేష్ కి ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా కథలోని మెయిన్ ఎమోషన్స్ అద్భుతంగా వచ్చాయని.. ఎలాగూ మెహర్ రమేష్ లో మంచి షార్ప్ డైరెక్టర్ ఉన్నాడు కాబట్టి సినిమా బాగా వస్తోందని చిరు నమ్మారు. నిజంగానే హీరోలను స్టైలిష్ గా చూపించడంలో మెహర్ రమేష్ కి ఉన్న టాలెంట్ అతి తక్కువ మంది డైరెక్టర్లకి మాత్రమే ఉంది.

మరి మెహర్ రమేష్ ఈ సినిమాతో హిట్ కొట్టి.. తనకు ఉన్న ప్లాప్ డైరెక్టర్ ట్యాగ్ ను పోగొట్టుకుంటాడేమో చూడాలి. గతంలో ఎన్టీఆర్, ప్రభాస్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో మెహర్ రమేష్ భారీ చిత్రాలను తీసిన కనీస హిట్ కొట్టలేదు. ఇక ఈ సినిమాలో చిరుకి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది. మెగాస్టార్ కూడా తన కెరీర్ లో ‘భోళా శంకర్’ పాత్ర కోసం పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు.