Godfather Collections: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది..మొదటి రోజు కలెక్షన్స్ మెగాస్టార్ చిరంజీవి రేంజ్ లో రాకపోయినప్పటికీ కూడా..రెండవ రోజు నుండి మాత్రం మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ వద్ద శివ తాండవం ఆడిస్తున్నాడు అనే చెప్పాలి..మొదటి రోజు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాకి కలిపి 13 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసిన ఈ చిత్రం రెండవ రోజు ౮ కోట్ల రూపాయిలు వసూలు చేసింది..ఇక మూడవ రోజు సంపూర్ణమైన వర్కింగ్ డే అయ్యినప్పటికీ కూడా మార్నింగ్ షోస్ నుండే అదిరిపొయ్యే ఆక్యుపెన్సీలతో ప్రారంభమైంది..ఇక మాట్నీ షోస్ నుండి అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ ముక్క కూడా దొరకలేదు..దసరా తర్వాత వచ్చే రోజులు సినిమా ఇండస్ట్రీ కి సరిపడదు అని అందరూ అంటూ ఉంటారు..కానీ గాడ్ ఫాదర్ విషయం లో మాత్రం అది రివర్స్ అయ్యింది.

మూడవ రోజు ఈ సినిమాకి సుమారు 8 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..అంటే మూడవ రోజు సుమారు 7 కోట్ల రూపాయిల షేర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట..ఇక మొదటి రోజు విడుదల కానీ ప్రాంతాలైన ఆస్ట్రేలియా మరియు చెన్నై వంటి చోట్ల ఈరోజు ఈ సినిమా విడుదలైంది..అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ తెరిచినా నిమిషాల వ్యవధి లోనే హౌస్ ఫుల్ బోర్డ్స్ పడిపోతున్నాయి..ఇదంతా చూస్తుంటే ఈ సినిమా మూడు రోజులకు కలిపి ప్రపంచ వ్యాప్తంగా 38 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసినట్టు అంచనా వెయ్యొచ్చు..మరో పక్క హిందీ లో కూడా ఈ సినిమా మొదటి మూడు రోజులు దంచి కొట్టేసింది..రేపు వీకెండ్ అవ్వడం తో అక్కడ కూడా భారీ స్థాయి వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక ఈరోజు అద్భుతమైన వసూళ్లు రావడం చూస్తుంటే కచ్చితంగా ఈ సినిమాకి లాంగ్ రన్ కూడా బాగా వచ్చేటట్టు కనిపిస్తుంది..ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 92 కోట్ల రూపాయలకు జరిగింది..అంత మొత్తం ఈ సినిమా ఫుల్ రన్ లో అందుకొని సూపర్ హిట్ సాధిస్తుందా లేదా అనేది చూడాలి.