https://oktelugu.com/

Mega Star Chiranjeevi: షాకింగ్ : ఏనుగు పై నుంచి కిందపడ్డ మెగాస్టార్ !

Mega Star Chiranjeevi: అరవై ప్లస్ లో కూడా మెగాస్టార్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉన్నారు. గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నారు. అయితే, చిరు షూటింగ్ లో ఏనుగు పై నుంచి పడ్డారు అన్న వార్త ప్రస్తుతం ఫ్యాన్స్ ను షాక్ కి గురి చేసింది. ఎవ్వరూ ఊరికే సూపర్ స్టార్లు మెగాస్టార్లు అయిపోరు . ఆ స్టార్ డమ్ వెనుక ఎవ్వరికీ తెలియని కలల పోరాటం ఉంటుంది. ఒక్కోసారి ఒళ్ళు హూనం […]

Written By:
  • Shiva
  • , Updated On : March 31, 2022 / 04:39 PM IST
    Follow us on

    Mega Star Chiranjeevi: అరవై ప్లస్ లో కూడా మెగాస్టార్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉన్నారు. గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నారు. అయితే, చిరు షూటింగ్ లో ఏనుగు పై నుంచి పడ్డారు అన్న వార్త ప్రస్తుతం ఫ్యాన్స్ ను షాక్ కి గురి చేసింది. ఎవ్వరూ ఊరికే సూపర్ స్టార్లు మెగాస్టార్లు అయిపోరు . ఆ స్టార్ డమ్ వెనుక ఎవ్వరికీ తెలియని కలల పోరాటం ఉంటుంది. ఒక్కోసారి ఒళ్ళు హూనం అవుతున్నా.. వెనకడుగు వేయని తెగువ ఉంటుంది. ఇది నిజమే అని తాజాగా మెగాస్టార్ మళ్లీ నిరూపించారు.

    మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీతో చేస్తున్న సినిమాకి సంబంధించి లాస్ట్ వీక్ లో కొన్ని యాక్ష‌న్ సీన్స్ ను షూట్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్స్ లో ఈ షూటింగ్ పార్ట్ జరిగింది. షూటింగ్ లో భాగంగా మెగాస్టార్.. ఏనుగు పై స‌వారీ చేయాల్సి వచ్చింది. నిజానికి ఈ షాట్ ను డూప్ పెట్టి చేయించొచ్చు.

    Mega Star Chiranjeevi

    అయితే, మెగాస్టార్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. డూప్ లేకుండా నేనే చేస్తాను అంటూ ఆయన ఆ సీన్ చేయడానికి సన్నద్ధం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఏనుగు పైకి ఎక్కి చిరు షూటింగ్ చేయాల్సి వచ్చింది. చిరు కూడా చాలా బాగా షూట్ చేశారు. అయితే.. ఏనుగు పై నుంచి కింద‌కి దిగేక్ర‌మంలో ఓ ఆర్ట్ అసిస్టెంట్ చేసిన చిన్న పొరపాటు కారణంగా చిరు కాలు జారింది.

    దాంతో, అనుకోకుండా చిరంజీవి జారి కింద ప‌డ్డారు. కాలు బాగా బెణికింది. సహజంగా అరవై ఏళ్ల వయసులో కాలు బెణికితే.. ఎవరైనా ఏమి చేస్తారు ? వెంటనే హాస్పిటల్ కి వెళ్తారు. కానీ.. చిరు మాత్రం ఆ నొప్పిని ఓర్చుకొంటూ.. ఆ రోజు మొత్తం షూటింగ్ లోనే ఉన్నారు. తనకు దెబ్బ తగిలిందని తాను వెళ్లిపోతే.. షూటింగ్ మొత్తం డిస్ట్ర‌బ్ అవుతుంద‌ని, నిర్మాతకు నష్టం వస్తోందని చిరు ఆ రోజు మొత్తం నొప్పిని భరిస్తూనే షూటింగ్ చేశారు.

    నిర్మాతల బాగు గురించి మెగాస్టార్ అంతలా ఆలోచిస్తారు కాబట్టే.. ఆయనతో సినిమాలు చేసిన ఏ నిర్మాత ఇంతవరకు ఆర్ధికంగా పూర్తిగా దెబ్బ తిన్న సంఘటన ఒక్కటీ లేదు. నిజానికి మెగాస్టార్ సినీ కెరీర్‌లో ఇలాంటివి ఎన్నో..మరెన్నెన్నో సంఘటనలు ఉన్నాయి. అన్నీ అవన్నీ దాటుకుని నిలబడ్డారు కాబట్టే.. చిరు మెగాస్టార్ అయ్యారు. నేటికీ అదే స్టార్ డమ్ ను కొనసాగిస్తున్నారు.

    Tags