Megastar Chiranjeevi : డ్యాన్స్ అంటే చిరంజీవి(Megastar Chiranjeevi), చిరంజీవి అంటే డ్యాన్స్. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఒక విధంగా డ్యాన్స్ నేర్పిందే ఆయన. చిరంజీవి పరిచయం చేసిన ఎన్నో డ్యాన్స్ ఫామ్స్ కారణంగా కమర్షియల్ సినిమాకు కొత్త ఊపిరి పోసినట్టు అయ్యింది. అప్పటి వరకు ఒకే మూసలో కృష్ణ, ఎన్టీఆర్, శోభన్ బాబు వంటి వారు డ్యాన్స్ చేసేవాళ్ళు. అప్పట్లో ఆడియన్స్ కి వీళ్ళు చేసిందే డ్యాన్స్ అన్నట్టు గా ఉండేది. కానీ ఎప్పుడైతే చిరంజీవి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి డ్యాన్స్, ఫైట్స్ చేయడం మొదలు పెట్టాడో, టాలీవుడ్ ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఎందుకంటే అప్పటి వరకు అంత వేగంగా, అంత అందంగా డ్యాన్స్ చేసిన వాళ్ళను వాళ్ళు చూడలేదు కాబట్టి. అలా టాలీవుడ్ కే డ్యాన్స్ నేర్పించిన మెగాస్టార్, ఒక సినిమా షూటింగ్ లో డ్యాన్స్ చేయలేక సొమ్మసిల్లి పడిపోయాడు అంటే నమ్ముతారా?.
Also Read :
కానీ నమ్మాలి, ఎందుకంటే అది నిజం కాబట్టి. మెగాస్టార్ ని దర్శకులందరూ పని రాక్షసుడు అని అంటుంటారు. కెరీర్ ప్రారంభం లో ఎలా ఉండేవాడో ఇప్పటికీ అలాగే ఉంటున్నాడు. మెగాస్టార్ డెడికేషన్ ఎలాంటిదో మీకు ఒక ఉదాహరణ చెప్పబోతున్నాము. ఆరోజుల్లో చిరంజీవి, రాఘవేంద్ర రావు, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ అనే చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాల్లోని పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. అయితే అప్పట్లో ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కేవలం ఒక్క పాట మినహా మొత్తం పూర్తి అయ్యింది. మేకర్స్ విడుదల తేదీని ప్రకటించేసారు. ఒక్క పాట షూటింగ్ చేయాలి, లేకపోతే విడుదల వాయిదా వెయ్యాల్సిందే. కథకి లింక్ అయినటువంటి ఆ పాత్రని ఎత్తేసి సినిమాని విడుదల చేసేందుకు కూడ వీలు లేదు.
అలాంటి పరిస్థితి లో మెగాస్టార్ చిరంజీవి కి మలేరియా సోకింది. 103 జ్వరం తో ఇబ్బంది పడుతున్నాడు. తనకు బాగలేదు కదా అని షూటింగ్ ని వాయిదా వేస్తే, సినిమా విడుదల వాయిదా పడుతుంది. నిర్మాతకు కోట్లలో నష్టం వాటిల్లుతుంది. తనవల్ల ఒక్క పైసా కూడా నష్టం రాకూడదు అనే ఉద్దేశ్యంతో చిరంజీవి ఆ 103 జ్వరం తోనే సాంగ్ షూటింగ్ లో పాల్గొన్నాడట. షూటింగ్ కి తనతో పాటు ఒక డాక్టర్ ని తెచ్చుకున్నాడు. ఈ సాంగ్ చిత్రీకరణ సమయంలో చిరంజీవి ఎన్నిసార్లు అదుపుతప్పి కిందకి పడిపోయాడో లెక్కే లేదు. ఎట్టకేలకు ఆ తీవ్రమైన జ్వరం తోనే షూటింగ్ పూర్తి చేసాడు. పాట అయిపోగానే ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు వెంటనే ఆయన్ని పక్కనే ఉన్నటువంటి విజయ హాస్పిటల్ కి తరలించారు. దాదాపుగా 15 రోజుల తర్వాత మళ్ళీ కోలుకున్నాడు. మెగాస్టార్ కి సినిమా మీద ఎంతటి డెడికేషన్ అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే, ఇలాంటివి ఎన్నో సందర్భాలు ఉన్నాయి.