Megastar Chiranjeevi: మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందారు మెగా తనయ నీహారిక. షార్ట్ ఫిల్మ్, బుల్లి తెర యాంకర్ గా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు నిహారిక. ” ఒక మనసు ” సినిమాతో కధానాయికగా వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వచ్చిన హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహారెడ్డి వంటి చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరచుకున్నారు ఈ భామ. కాగా వివాహానంతరం సినిమాలకు దూరంగా ఉన్నారు ఈమె. అయితే తాజాగా నిహారిక నిర్మాతగా మారి ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ నిర్మించిన విషయం తెలిసిందే.
Chiranjeevi and Niharika
ఇటీవలే జీ5 ఓటీటీలో వేదికలో రిలీజ్ అయినా వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’. ఈ వెబ్ సిరీస్ ప్రోమోతోనే ప్రేక్షక అభిమానుల్లో అంచనాలు కలిగించింది. ప్రసుతం ఈ వెబ్ సిరీస్ మంచి స్పందన లభిస్తుంది. తాజాగా తమ కూతరు నిహారికాపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. తాను ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ చూశానని… చాలా సరదాగా వినోదాత్మకంగా ఉందని చిరంజీవి చెప్పుకొచ్చారు.
Also Read: Mahesh Babu: అందరూ సంతోషమే.. ఒక్క మహేష్ అభిమానులు తప్ప !
అలానే కొణిదెల వారి ఆడపడుచు నిహారికకు, ఓసీఎఫ్ఎస్ బృందానికి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా విసెష్ చెప్పారు. నిహారిక తొలి ప్రయత్నంలోనే నిర్మాతగా సక్సెస్ అందుకుంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీని అందరి మనసుకు హత్తుకు పోయే అద్భుతమైన కథగా గుర్తుండి పోతుందని మెగాస్టార్ చిరంజీవి పొగడ్తల వర్షం కురిపించారు. అలానే దీనిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని చిత్రాలను నిర్మించాలంటూ చిరంజీవి తెలిపారు.
Also Read: Sirivennela Seetharama Sastri: చిత్ర పరిశ్రమలో విషాదం… దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల మృతి
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Megastar chiranjeevi appreciates niharika and oka chinna family story team
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com