https://oktelugu.com/

Rajinikanth :  రజినీకాంత్ రాసిన కథతో చిరంజీవి కొత్త సినిమా..డైరెక్టర్ ఎవరో తెలిస్తే అభిమానులు మెంటలెక్కిపోతారు!

రజినీకాంత్ తమిళనాట నెంబర్ 1 హీరో, ఆయన నుండి ఇలాంటి కథలను రిసీవ్ చేసుకోవడం అభిమానులకు కష్టమైంది కానీ, ఇప్పటి తరం ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎంతగానో ఇష్టపడుతారు. ఈ సినిమాని ఈమధ్య కాలంలోనే 4K కి మార్చి రీ రిలీజ్ చేయగా, ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనిని బట్టే అర్థం చేసుకోవాలి, ఈ సినిమాలో ఎంత మంచి కంటెంట్ ఉంది అనేది

Written By:
  • Vicky
  • , Updated On : December 6, 2024 / 08:18 PM IST

    Superstar Rajinikanth Story

    Follow us on

    Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ కేవలం మనకి ఒక హీరో గా మాత్రమే తెలుసు. కానీ ఆయనలో ఒక గొప్ప రచయత కూడా ఉన్నాడు అనే విషయం చాలా మందికి తెలియదు. ఆయన తన స్వీయ దర్శకత్వం లో నటించేందుకు కోసం చాలా కథలే రాసుకున్నాడు. కెరీర్ లో వరుసగా హిట్టు మీద హిట్టు కొడుతూ దూసుకుపోతున్న సమయంలో ఆయన కెరీర్ లో పెద్ద ఫ్లాప్ గా నిల్చిన చిత్రం ‘బాబా’. ఈ సినిమాకి కథ, మాటలు అందించింది రజనీకాంత్. అప్పట్లో రజినీకాంత్ తమిళనాట నెంబర్ 1 హీరో, ఆయన నుండి ఇలాంటి కథలను రిసీవ్ చేసుకోవడం అభిమానులకు కష్టమైంది కానీ, ఇప్పటి తరం ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎంతగానో ఇష్టపడుతారు. ఈ సినిమాని ఈమధ్య కాలంలోనే 4K కి మార్చి రీ రిలీజ్ చేయగా, ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనిని బట్టే అర్థం చేసుకోవాలి, ఈ సినిమాలో ఎంత మంచి కంటెంట్ ఉంది అనేది.

    ఈ సినిమా తర్వాత ఆయన మోహన్ బాబు కోసం అప్పట్లో ‘రాయలసీమ రామన్న చౌదరీ’ అనే చిత్రానికి కథని అందించాడు. ఆరోజుల్లో ఈ సినిమా కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది కానీ, కంటెంట్ పరంగా సినిమా అద్భుతంగా వచ్చిందనే చెప్పాలి. ఇందులో మోహన్ బాబు పాత్ర ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ఆయన పాత్రలోని ఎమోషన్స్, పలికే డైలాగ్స్ ఆడియన్స్ ని ఆలోచింపచేసేలా ఉంటుంది. మోహన్ బాబు కెరీర్ లో హీరో గా నటించిన సినిమాలలో, ఆల్ టైం క్లాసిక్స్ లిస్ట్ ఒకసారి తీస్తే, అందులో ఈ చిత్రం కచ్చితంగా ఉంటుంది. ముందుగా ఈ సినిమాలో రజినీకాంత్ హీరో గా నటించాలని అనుకున్నాడు కానీ,మోహన్ బాబు కి ఈ కథ బాగా నచ్చడంతో ఆయన తీసుకొని నటించాడు. ఇప్పటికీ ఈ చిత్రం టీవీ టెలికాస్ట్ అయినప్పుడు మంచి రేటింగ్స్ ని సంపాదించుకుంటూ ఉంటుంది.

    ఇదంతా పక్కన పెడితే ఫిలిం నగర్ లో వినిపిస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం, త్వరలోనే రజినికాంత్ రాసిన ఒక కథలో హీరో గా మెగా స్టార్ చిరంజీవి నటించబోతున్నాడట. రజినీకాంత్ దగ్గర తన వయస్సుకి తగ్గ, సందేశాత్మక కథ ఉందని తెలుసుకున్న చిరంజీవి, వెంటనే రజినీకాంత్ కి ఫోన్ చేసి నాకు ఆ కథ కావాలి అని చెప్పగానే రజినీకాంత్ అందుకు ఒప్పుకొని, ఆ కథని చిరంజీవి కి ఇచ్చాడని తెలుస్తుంది. గతం లో చిరంజీవి తో ‘స్టాలిన్’ వంటి సూపర్ హిట్ ని అందించిన తమిళ దర్శకుడు మురగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ తో ‘సికందర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న మురగదాస్, ఆ సినిమా పూర్తి అవ్వగానే ఈ చిత్రానికి షిఫ్ట్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు అధికారికంగా తెలియనున్నాయి. వచ్చే ఏడాది లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లొచ్చు.