https://oktelugu.com/

Megastar Chiranjeevi: మరో కొత్త ప్రాజెక్టు కి ఓకే చెప్పిన మెగాస్టార్ చిరంజీవి… డైరెక్టర్ ఎవరంటే ?

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు జెట్ స్పీడ్‏తో దూసుకుపోతున్నారు. ఖైదీ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరు ఇప్పుడు వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ పుల్ జోష్ మీదున్నారు. ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్… మరోవైపు కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కుర్రహీరోలకు గట్టి కాంపిటీషన్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా చిరంజీవి.. తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ వెంకి కుడుముల దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 14, 2021 / 07:09 PM IST
    Follow us on

    Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు జెట్ స్పీడ్‏తో దూసుకుపోతున్నారు. ఖైదీ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరు ఇప్పుడు వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ పుల్ జోష్ మీదున్నారు. ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్… మరోవైపు కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కుర్రహీరోలకు గట్టి కాంపిటీషన్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా చిరంజీవి.. తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ వెంకి కుడుముల దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్‏కు అఫీషియల్ అనౌన్స్‏మెంట్ ఇచ్చారు మేకర్స్. ముందు నుంచి వినిపిస్తున్నట్టుగానే.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కించబోయే చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ.

    ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలతో విజయాలు అందుకున్న వెంకీ కుడుముల ఈసారి మెగాస్టార్ ను ఏ రేంజ్ లో చూపిస్తారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. వెంకీ చిరంజీవికి వీరాభిమాని అని తెలిసిందే… గతంలో పలు సందర్భాల్లో కూడా ఆయన బహిరంగంగానే ఈ విషయం చెప్పారు. రామ్ చరణ్ ‘జంజీర్’ సినిమాలో ఓ సన్నివేశంలో కూడా వెంకీ కుడుముల కనిపించారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా పూర్తిచేశారు చిరంజీవి. ఇందులో కాజల్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఇక మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా, మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న భోళా శంకర్ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నాయి. బాబీ తెరకెక్కిస్తున్న మెగా 154 లో కూడా చిరు పాల్గొంటున్నాడు.