ప్రతి నెల మెగా పండుగే.. రెడీగా ఉండండి !

అవును, ఇక నుండి ప్రతి నెల మెగా పండుగే ఉండబోతుంది. మెగా ఫ్యాన్స్ కి కావాల్సినంత ఎంటర్ టైన్మెంట్ రెడీ కాబోతుంది. ఏ హీరో అభిమానులకు లేని అవకాశాలు, మెగా అభిమానులకు ఉంది. మెగా కాపౌండ్ లో హీరోలు ఎక్కువ.. సినిమాలు ఎక్కువ. ఎక్కువ గ్యాప్ లేకుండా కంటిన్యూగా సినిమాలు రిలీజ్ అవుతాయి. పైగా కరోనా పుణ్యమా అని సినిమాలన్నీ ఒకే ఏడాది రాబోతున్నాయి. Also Read: చిరంజీవి రీమేక్ స్టారా..? సూప‌ర్ హిట్ల‌న్నీ అవేనా..?! అందుకే మెగా […]

Written By: admin, Updated On : March 11, 2021 1:02 pm
Follow us on


అవును, ఇక నుండి ప్రతి నెల మెగా పండుగే ఉండబోతుంది. మెగా ఫ్యాన్స్ కి కావాల్సినంత ఎంటర్ టైన్మెంట్ రెడీ కాబోతుంది. ఏ హీరో అభిమానులకు లేని అవకాశాలు, మెగా అభిమానులకు ఉంది. మెగా కాపౌండ్ లో హీరోలు ఎక్కువ.. సినిమాలు ఎక్కువ. ఎక్కువ గ్యాప్ లేకుండా కంటిన్యూగా సినిమాలు రిలీజ్ అవుతాయి. పైగా కరోనా పుణ్యమా అని సినిమాలన్నీ ఒకే ఏడాది రాబోతున్నాయి.

Also Read: చిరంజీవి రీమేక్ స్టారా..? సూప‌ర్ హిట్ల‌న్నీ అవేనా..?!

అందుకే మెగా హీరోలందరూ ఈ ఏడాది రేసులో ఉన్నారు. ఇప్పటికే ఫిబ్రవరిలో ఉప్పెన అంటూ మెగా మేనల్లుడు సూపర్ హిట్ కొట్టాడు. అలాగే ఈ మార్చిలో మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఇక నుండి ప్రతి నెల అనగా అక్టోబర్ వరకూ నెలకో మెగా మూవీ విడుదలకు సిద్ధం కానుంది. ఏప్రిల్ 9న పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ రిలీజ్ కి రెడీ అవుతుంది.

Also Read: ప్రభాస్‌ బాడీపై శ్రీరెడ్డి హాట్‌ కామెంట్స్‌

ఇక మే నెలలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ వస్తుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో ఏప్రిల్, మే నెలల కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక జూన్ 2న దేవకట్టా దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రిపబ్లిక్’ కూడా బరిలోకి దిగబోతుంది. డిసెంబర్లో సాయి తేజ్ ‘సోలో బ్రతుకు సో బెటర్’ అంటూ వచ్చి, మళ్ళీ ఆరు నెలల గ్యాప్ లోనే ఇంకోటి విడుదల చేయబోతున్నాడు. ఈ సినిమా పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

కాగా జులైలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న ‘గని’ సినిమా రిలీజ్ కానుంది. ఆగస్టు విషయానికి వస్తే.. అల్లు అర్జున్ నటిస్తున్న పాన్-ఇండియా మూవీ ‘పుష్ప’ ఆగస్టు 13న విడుదల కానుంది. సెప్టెంబర్ లో కూడా పవన్ కళ్యాణ్ – రానా హీరోలుగా రూపొందుతోన్న ‘రీమేక్’ మూవీ రిలీజ్ అవుతుందట. ఇక ఫైనల్ గా రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ 13న థియేటర్లను షేక్ చేయడానికి రెడీ అవుతుంది.