Meelo Evaru Koteeswarudu: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ (Meelo Evaru Koteeswarudu) ఎపిసోడ్ సంఖ్య పెరిగే కొద్దీ.. ‘షో’ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ తన మాటతీరుతో గెస్ట్ లతో సాగిసొన్న తన సంభాషణలతో మొత్తానికి షోను సూపర్ హిట్ చేశాడు. పైగా తన సన్నిహితులను కూడా ఈ షోకు తెస్తూ.. ఆ రకంగానూ షో స్థాయి పెంచుతూ టీఆర్పీ రేటింగ్ ను భారీగా పెంచుతున్నాడు.
ఇక ఈ షోలోకి దర్శక దిగ్గజాలు రాజమౌళి, కొరటాల శివ వచ్చారు. వీరికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్, రాజమౌళి, కొరటాలతో మాట్లాడిన మాటలు, వారి చేత గేమ్ ఆడిస్తోన్న విధానం బాగా ఆకట్టుకుంది. మొత్తమ్మీద ఈ ప్రోమోను బాగా కట్ చేశారు. ఇక ఈ నెల 20న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని జనవరి 7వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అన్నట్టు ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ కలిసి హీరోలుగా నటిస్తుండటంతో ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా భారీ బిజినెస్ జరుగుతుంది. ఇప్పటికే ‘పెన్ స్టూడియోస్’ సంస్థ ఈ సినిమా ‘నార్త్ థియేట్రికల్’ హక్కులను సొంతం చేసుకుంది.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. తనకు ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాలతో తన 30వ సినిమాని ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో చేస్తుండటం నిజంగా విశేషమే. మరి ప్రస్తుతం చేస్తోన్న డైరెక్టర్, అలాగే తర్వాత చేయబోతున్న డైరెక్టర్ ఇద్దరూ ఎన్టీఆర్ షోకు వచ్చారు కాబట్టి.. సినిమాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించనున్నారు.
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ టీమ్ నుంచి ఇండస్ట్రీలోకి వెళ్లిన పుకారు అయితే, ఈ షోలో ఎన్టీఆర్ లోని పలు ఆసక్తికర విషయాలను రాజమౌళి, కొరటాల శివతో సెటైర్లు వేస్తూ పంచుకోబోతున్నారట. అలాగే కొరటాల కూడా ఎన్టీఆర్ నటన గురించి గొప్పగా చెబుతాడట.