Media Channels: బాలీవుడ్ సూపర్ స్టార్ ‘షారుక్ ఖాన్’ కొడుకు ‘ఆర్యన్ ఖాన్’ డ్రగ్స్ తీసుకోవడం దేశంలోనే అతి పెద్ద సమస్యా ? గత కొన్ని రోజులుగా దేశంలోని ప్రధాన మీడియా ఫోకస్ చేసిన న్యూస్ ఏమిటో తెలుసా ? ‘ఆర్యన్ ఖాన్’ అనే లోకజ్ఞానం లేని బడా బాబు సుపుత్రుడు ఏదో ఒక పనికిమాలిన చేశాడు. సరే.. ఇది కూడా ఒక న్యూసే, కానీ ఇదే న్యూస్ కాదు కదా ?

ఆర్యన్ అడ్డంగా బుక్ అయ్యాడు, అతన్ని కోర్టుకు తీసుకువెళ్తునారు ? లేదు ఆర్యన్ ఖాన్ ఇప్పుడే కన్నీళ్లు పెట్టుకున్నాడు ? ఇలా సాగుతూ వస్తోంది బ్రేకింగ్ న్యూస్. తప్పెవరిది ? మీడియాదా ? మీడియాలో బలంగా పాతుకుపోయి తమ శాడిజం చూపిస్తున్న కుళ్లిపోయిన జర్నలిస్ట్ లదా ? తప్పెవరిది ? అసలు దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి.
నిత్యం ఎన్నో అక్రమాలు అన్యాయాలు, సామాన్యులకు జరుగుతున్న అసమాన్య సంఘటనలు.. ఇలా ఎన్నో ఉన్నాయి. మీడియాకి ఇవేవి పట్టవు. వాళ్లకు హీరో కొడుకు డ్రగ్స్ వ్యవహారం, హీరో హీరోయిన్ల విడాకుల వ్యవహారమే కావాలి. జనానికి కూడా ఇవే ఇంట్రెస్ట్ గా ఉంటాయి. ఈ మధ్య దేశంలో జరిగిన అతి పెద్ద సమస్య రైతుల్ని కారుతో తొక్కించి చంపేసిన విధానం మీడియా పెద్దగా పట్టదు.
ఎందుకంటే.. ఆ వార్తలో మసాలా లేదు. పోనీ మంచి కిక్ ఇచ్చే అంశం కూడా లేదు. పైగా బాధ ఉంది, భారం ఉంది. కన్నీళ్లు ఉన్నాయి. ఎవరికి కావాలి ఈ కన్నీళ్లు కష్టాలు ? పోనీ, ఆర్యన్ ఖాన్ దొరికిన ముంద్రా పోర్టులో దొరికిన వేల కేజీల హెరాయిన్ తో కూడా పెద్దగా పని లేదు. స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ ఎంత తీసుకున్నాడు ? ఏం డ్రగ్స్ తీసుకున్నాడు ? అసలు అతనితో పాటు ఎవరు ఉన్నారు ? ఇవే మీడియాకి కావాలి.
అందుకే గత కొన్ని రోజులుగా ఆర్యన్ ఖాన్ వ్యవహారమే మెయిన్ టాపిక్ అయిపోయింది. అయినా ఇక్కడ మీడియాని కూడా తప్పు పట్టలేం. రాజకీయ నేతల అరాచకాల పై కథనాలు వేస్తే ఎవరు చూస్తారు ? ఎవరు చదువుతారు ? బలైపోయిన రైతుల బాధలు ఎవరికీ కావాలి. హీరోయిన్ల ఘాటు ఫోటోషూట్లు కావాలి, హీరోల పై గాసిప్ లు కావాలి. ఆర్యన్ ఖాన్ కస్టడీలో ఏం చేస్తున్నాడో కావాలి.
Also Read: Prabhas: డబుల్ యాక్షన్ లో ప్రభాస్ క్రేజీ యాక్షన్ ?
అప్పుడే కదా మీడియాకి టీఆర్పీ రేటింగ్ లు వచ్చేది. అప్పుడే కదా మీడియా రేటింగ్ రేసులో తమ ఛానెల్ ముందుకు పోయేది. ఈ క్రమంలో డ్రగ్స్ వాడకాన్ని హీరోయిజంలా చూపిస్తే అది మీడియా తప్పు ఎలా అవుతుంది ? అది జనం చేసుకున్న దౌర్భగ్య పరిస్థితి అని ఎందుకు అర్థం చేసుకోరు. కాబట్టి.. దేని గురించి ఎవరు ఏమి మాట్లాడినా.. ప్రతిదానికి అనేక బొక్కలు ఉన్నాయని సరిపెట్టుకోవడమే సగటు మనిషి ముందు ఉన్న ఏకైక ఆప్షన్. .