Mass Jathara Day 1 Collections: మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) నటించిన లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర'(Mass Jathara Movie) రీసెంట్ గానే వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. ‘ధమాకా’ తర్వాత వరుసగా ఆరు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను అందుకున్న రవితేజ, ఈ చిత్రం తో మరో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. కొత్త దర్శకులను ప్రోత్సహించడం లో రవితేజ ఎప్పుడూ ముందు ఉంటాడు. అలా ప్రోత్సాహం అందించబట్టే నేడు మన ఇండస్ట్రీ కి బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని,బాబీ వంటి టాప్ డైరెక్టర్స్ వచ్చారు. వీళ్లంతా రవితేజ తో హిట్ సినిమాలు చేసి, తద్వారా వచ్చిన క్రేజ్ తో పెద్ద హీరోల సినిమాలు చేసుకుంటూ వెళ్లారు కానీ, వాళ్లకు ఫేమ్ వచ్చిన తర్వాత రవితేజ తో మాత్రం సినిమాలు చేయడం లేదు. దీంతో కొత్తవాళ్లను నమ్మడం వల్ల రవితేజ మరో ఫ్లాప్ ని ఎదురుకోవాల్సి వచ్చింది.
అయితే రవితేజ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయినప్పటికీ మినిమం గ్యారంటీ ఓపెనింగ్ వసూళ్లు వస్తుంటాయి. ఈ సినిమాకు కూడా అలాంటి ఓపెనింగ్ వచ్చింది అనుకోవచ్చు. విడుదలకు ముందు రోజు అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ ప్రీమియర్ షోస్ నుండి రెండు కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు,కోటి 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. హైదరాబాద్ , బెంగళూరు వంటి సిటీస్ లో కలెక్షన్స్ పెద్దగా లేకపోయినప్పటికీ, మాస్ సెంటర్స్ లో మాత్రం మంచి ఓపెనింగ్ ని తెచ్చుకుంది ఈ చిత్రం. ముఖ్యంగా సింగల్ స్క్రీన్స్ కలెక్షన్స్ బాగున్నాయట. ఇక మొదటి రోజున ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో 4 నుండి 4.5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. వరుస ఫ్లాప్స్ ని ఎగురుకుంటూ వస్తున్నప్పటికీ కూడా రవితేజ కి ఇంతటి ఓపెనింగ్ రావడం అనేది నిజంగా సర్ప్రైజ్.
ఓవరాల్ గా మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఈ చిత్రానికి జరిగిన వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 20 కోట్ల వరకు ఉంటుంది. మొదటి వీకెండ్ లో పది కోట్ల రూపాయలకు దగ్గరగా ఈ సినిమా షేర్ వసూళ్లను రాబట్టొచ్చు. ఇక మిగిలిన రోజుల్లో డీసెంట్ స్థాయి పెర్ఫార్మన్స్ ని చూపించినా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది. చూడాలి మరి ఈ సినిమా తలరాత ఏమిటి అనేది. అయితే ఈ చిత్రం తో పాటు విడుదలైన ‘బాహుబలి : ది ఎపిక్’ రీ రిలీజ్ కి మొదటి రోజే 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దాంతో పోలిస్తే మాస్ జాతర గ్రాస్ దరిదాపుల్లో కూడా లేదని అంటున్నారు విశ్లేషకులు.