Homeఎంటర్టైన్మెంట్MASOODA TEASER Talk : మసూద.. ఓ దెయ్యం పట్టిన అమ్మాయి కథ.. వీడియో గూస్...

MASOODA TEASER Talk : మసూద.. ఓ దెయ్యం పట్టిన అమ్మాయి కథ.. వీడియో గూస్ బాంబ్స్

MASOODA TEASER Talk : సినిమాలు ఎప్పుడూ మూసధోరణితో తీస్తే ఎవరికీ నచ్చవు. సమ్ థింగ్ స్పెషల్ గా ఉండాలి. అలాంటి కథలు ఎప్పుడూ చూడనివి అయ్యిండాలి. మరీ ముఖ్యంగా ప్రేక్షకుడి ఊహకు అందకుండా ఉండాలి. అప్పుడే విజయం తథ్యం. ముఖ్యంగా హర్రర్ కథలు ఎప్పుడూ ప్రేక్షకుడిని కుర్చీకి కట్టిపడేస్తాయి. సాధారణ ఫ్యామిలీ, ప్రేమ కథల కంటే కూడా వీటికి వ్యూయర్ షిప్ ఎక్కువగా ఉంటుంది.

తాజాగా ‘మసూద’ అంటూ ఓ దెయ్యం పట్టిన అమ్మాయి కథతో వస్తోంది స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సంస్థ. ఇప్పటికే ‘మ‌ళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ’ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న ఈ సంస్థ నుంచి ఇప్పుడు మసూద పేరుతో వస్తున్న ఈ హర్రర్, యాక్షన్ క్రైమ్ చిత్రం పూర్తిచేసింది. ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది. ఈ చిత్రానికి సాయికిరణ్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించారు.

హీరోగా ‘జార్జిరెడ్డి’ ఫేమ్ తిరువీర్ (ల‌ల్లన్ సింగ్ పాత్రధారి) న‌టిస్తుండగా.. ‘గంగోత్రి’ చిత్రంలో బాల‌న‌టిగా అల‌రించిన కావ్య క‌ల్యాణ్‌రామ్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిల రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాశ్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణ తేజ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రం ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఆద్యంత ఉత్కంఠ రేపుతోంది.

ఒక దెయ్యం పట్టిన అమ్మాయిని హీరో తిరువీర్.. లెక్చరర్ అయిన సంగీత కాపాడడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే ముస్లిం బాబాల వద్దకు, వైద్యుల వద్దకు తీసుకెళతారు. ఆ అమ్మాయి ప్రవర్తించే తీరు.. మధ్యలో హర్రర్, యాక్షన్ ఎపిసోడ్స్ హరబుల్ గా ఉన్నాయి.

మంగళవారం న్యాచురల్ స్టార్ నాని ఈ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించి.. టీజర్ ప్రామిసింగ్‌గా ఉందని, ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి ఈ చిత్రంలో చేసినట్లుగా అనిపిస్తుందని, టీజర్ చూస్తుంటే.. ఎప్పుడెప్పుడు సినిమాని చూద్దామా.. అని అనిపిస్తుందని తెలుపుతూ.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

తొలి రెండు సినిమాలతో గౌతమ్ తిన్ననూరి, స్వరూప్‌లను టాలీవుడ్‌కు పరిచయం చేసిన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా.. హర్రర్ డ్రామా జోనర్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంతో సాయికిరణ్ అనే మరో నూతన డైరెక్టర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.

టీజర్ విడుదల సందర్భంగా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్ర టీజర్‌ను విడుదల చేసిన న్యాచురల్ స్టార్ నాని గారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు. ఆయనకు టీజర్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సంస్థలో వస్తున్న ఈ మూడో చిత్రం కూడా ప్రేక్షకులను చక్కగా ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ చిత్రంతో సాయికిరణ్ అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నాము. సాయికిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి తీరు.. ప్రేక్షకులందరినీ మెప్పిస్తుంది. చిత్రంలో నటించిన నటీనటులకు, అలాగే పనిచేసిన సాంకేతిక నిపుణులకు, సహకరించిన అందరికీ ధన్యవాదాలు. త్వరలోనే చిత్ర ట్రైలర్‌, అలాగే మూవీ విడుదలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తాము..’’ అని తెలిపారు.

 మసూద ట్రైలర్

MASOODA TEASER I Sangitha, Thiruveer I Sai Kiran I Rahul Yadav Nakka.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version