Mask Man Harish Bigg Boss 9 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో టాప్ 5 లోకి అడుగుపెట్టేందుకు అన్ని రకాలుగా అర్హతలు ఉన్న కంటెస్టెంట్ మాస్క్ మ్యాన్ హరీష్. ‘అగ్నిపరీక్ష’ షోలో ఇతన్ని చూసినప్పుడు చాలా డిఫరెంట్ గా ఉన్నాడు, కచ్చితంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడని అంతా అనుకున్నారు. హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో అలాగే ఉండేవాడు కానీ, తనకు తానూ సొంతం గా ఎలివేషన్స్ ఇచ్చుకోవడం, ప్రతీ చిన్న దానికి హౌస్ మేట్స్ తో గొడవలు పడడం వంటివి ఆయన్ని ప్రతీ వారం డౌన్ చేస్తూ వచ్చింది. ముఖ్యంగా ఏదైనా గొడవ జరిగితే తన తోటి కంటెస్టెంట్స్ ఎవరితో కూడా మాట్లాడకుండా ఒక మూలాన కూర్చొని ఉండడం ఇతనికి చాలా పెద్ద మైనస్ అయ్యింది. ఎదో కాసేపు అలా ఉంటే అనుకోవచ్చు, రోజులు తరబడి ఆయన అలాగే ఉంటున్నాడు. అందుకే ఆడియన్స్ కి కూడా విసుగొచ్చి ఎలిమినేట్ చేసి బయటకు పంపేశారు.
బహుశా హరీష్ కి కూడా మనసులో ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనే ఫీలింగ్ ఉన్నది ఏమో అంటూ ఆడియన్స్ కూడా చెప్పుకొస్తున్నారు. అతని మనస్తత్వానికి ఈ బిగ్ బాస్ రియాలిటీ షో అసలు సూట్ కాదని అందరి అభిప్రాయం. అయితే అగ్నిపరీక్ష షో లో ఇతనికి టాస్కులు ఆడేందుకు ఫుల్ స్కోప్ దొరికింది. కానీ బిగ్ బాస్ హౌస్ లో మాత్రం ఆశించిన స్థాయిలో ఇతనికి టాస్కులు ఆడేందుకు స్కోప్ దొరకలేదు. కానీ టాస్కులు ఆడే ఛాన్స్ వచ్చినప్పుడల్లా దుమ్ము దులిపేసేవాడు. ఈ వారం కూడా ఆయన టాస్కులు బాగానే ఆడాడు కానీ, టాస్క్ మధ్యలో దెబ్బలు తగలడంతో మధ్యలో డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఈ వారం ఆయనకు స్క్రీన్ స్పేస్ కూడా అంతగా దొరకలేదు. ఫలితంగా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇకపోతే నాలుగు వారాలు హౌస్ లో ఉన్నందుకు మాస్క్ మ్యాన్ హరీష్ కి రెమ్యూనరేషన్ దాదాపుగా 3 లక్షల 20 వేల వరకు ఉంటుందని అంచనా. సామాన్యులందరికీ వారానికి 80 వేల రూపాయిలు ఇచ్చేలా ఒప్పందం కుదిరించుకున్నట్టు తెలుస్తుంది. సామాన్యుల క్యాటగిరీ లో కాస్త ఎక్కువ రోజలు హౌస్ లో ఉన్నాడు కాబట్టి ఇతనికి పర్వాలేదు అనే రేంజ్ లో రెమ్యూనరేషన్ వచ్చినట్టు తెలుస్తుంది. మరి హరీష్ ఇక్కడి నుండి బయటకు వెళ్లిన తర్వాత ఎలాంటి లైఫ్ సొంతం అవుతుంది?, సినిమాల్లో అవకాశాలు వస్తాయా?, లేదంటే ఇక్కడితోనే ఆయన ఆడియన్స్ కి పూర్తిగా దూరం అవుతాడా అనేది తెలియాల్సి ఉంది.