
Prabhas Kriti Sanon Marriage: ప్రభాస్ పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ . నలబై ఏళ్లు దాటినా ప్రభాస్ వివాహం చేసుకోలేదు. అయితే ఒకరిద్దరు హీరోయిన్స్ తో ఆయన ఎఫైర్ నడిపినట్లు పుకార్లు వినిపించాయి. అనుష్క శెట్టి-ప్రభాస్ లవ్ లో ఉన్నారని. పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారమైంది. అయితే ఈ వార్తలను ఇద్దరూ ఖండించారు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్, అనుష్క కలిసి పని చేయలేదు. ఆఫ్ స్క్రీన్ లో కూడా కలుసుకున్న దాఖలాలు లేవు. దీంతో వారి ఎఫైర్ రూమర్స్ వీగిపోయాయి. అనుష్కను చేసుకునే ఆలోచన ప్రభాస్ కి లేదని తేలిపోయింది.
తాజాగా ఆయన కృతి సనన్ తో ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంటున్నారు. ఆదిపురుష్ మూవీలో కృతి సనన్-ప్రభాస్ కలిసి నటించారు. ఆ చిత్ర సెట్స్ లో ప్రభాస్ హీరోయిన్ కృతి సనన్ కి ప్రపోజ్ చేశారట. ఆమె అంగీకారం తెలిపిన నేపథ్యంలో త్వరలో వివాహం అంటూ కథనాలు వెలువడ్డాయి. ఓవర్సీస్ ఫిల్మ్ క్రిటిక్, సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు ఈ మేరకు వరుస ట్వీట్స్ వేశారు. అలాగే హీరో వరుణ్ ధావన్ పేర్లు చెప్పకుండా ప్రభాస్-కృతి సనన్ ప్రేమలో ఉన్నట్లు చెప్పాడు.

దీంతో ప్రభాస్-కృతి సనన్ ల ప్రేమ వార్తలు పతాక శీర్షికలకు ఎక్కాయి. అయితే కృతి సనన్ ఈ వార్తలు ఖండించారు. ఇవన్నీ పుకార్లు మాత్రమే. ప్రభాస్ తో స్నేహానికి మించి ఎలాంటి బంధం లేదన్నారు. అయినా ఎఫైర్ రూమర్స్ సద్దుమణగలేదు. తాజాగా కృతి సనన్ మరోసారి స్పందించారు. వరుణ్ ధావన్ కామెంట్స్ నమ్మి… ఫ్రెండ్స్, సన్నిహితులు నాకు కంగ్రాట్స్ అంటూ సందేశాలు పంపారు. వరుణ్ ధావన్ చెప్పిన దాంట్లో నిజం లేదు. ప్రభాస్ నేను ప్రేమించుకోవడం లేదని తిరిగి వాళ్లకు వివరణ ఇచ్చాను… అని కృతి సనన్ వెల్లడించారు.
మాల్దీవ్స్ లో కృతి సనన్-ప్రభాస్ నిశ్చితార్థం జరుపుకోబోతున్నారంటూ ఉమర్ సంధు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కృతి సనన్ పలుమార్లు ఈ వార్తలను ఖండించినా… పుకార్లకు చెక్ పడటం లేదు. కాగా కృతి కెరీర్ మొదలైంది తెలుగులోనే. 2014లో వన్ నేనొక్కడినే చిత్రంతో సుకుమార్ ఆమెను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. అనంతరం నాగ చైతన్యకు జంటగా దోచేయ్ అనే మూవీ చేశారు. ఇక పౌరాణిక గాథగా తెరకెక్కిన ఆదిపురుష్ జూన్ 16న విడుదల కానుంది. కృతి సనన్ సీతగా నటిస్తుండగా ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు.