Manchu Family: తెలుగు ఇండస్ట్రీలో అలనాటి హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్.. ఇలా అన్ని పాత్రలు చేశారు కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. సుమారు 200 సినిమాల వరకు నటించారు. మోహన్ బాబుకు ఇద్దరు కొడుకులు, కూతురు సంతానం. తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని కొడుకులు విష్ణు, మనోజ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. అడపాదడపా సినిమాలు తీస్తున్నారు. కానీ, అవి పెద్దగా ఆడడం లేదు. దీంతో మనోచ్ ఇప్పటికే ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ.. వ్యాపారాలు చూసుకుంటున్నాడు. ఇక విష్ణు మాత్రం సక్సెస్ కోసం సినిమాలు చేస్తున్నాడు. ఇక కూతురు మంచు లక్ష్మి కూడా అప్పుడప్పుడు సినిమాలు, అప్పుడప్పుడు టీవీ షోల్లో మెరుస్తోంది. ఇదిలా ఉంటే.. మంచు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తాయి. విష్ణు, మనోజ్ మధ్య గొడవలు జరిగాయి. ఒకానొక సందర్భంగా పరస్పరం దాడి చేసుకునే వరకు వచ్చారు. కానీ, మంచు లక్ష్మి జోక్యంతో గొడవ తాత్కాలికంగా సద్దు మనిగింది. అయితే ఇప్పుడు మంజు మోహన్‌బాబు స్థాపించిన విద్యా సంస్థలో సమస్యలు తలెత్తాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాయి. ఈ తరుణంలో రంగంలోకి దిగిన మనోజ్.. ఆందోళన చేస్తున్న విద్యార్థులకే మద్దతు పలకడం చర్చనీయాంశమైంది.
మధ్య వర్తిత్వం వహిస్తానని..
విద్యార్థుల ఆందోళనలు పరిష్కరించడానికి మనోజ్ రంగంలోకి దిగినట్లు కనిపిస్తున్నా.. దాని వెనుక వ్యూహం వేరే ఉందన్న చర్చ జరుగుతోంది. విద్యార్థులకు మద్దతు పలికి, ఇంకా సమస్యలు ఉంటే తనతో చెప్పాలని కోరారు. తాను మోహన్‌బాబుతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటికే వస్తున్న ఆరోపణలపై తాను మోహన్‌బాబు యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ నుంచి వివరణ కోరానని తెలిపారు. ఇంకా రిప్లయ్ రాలేదని వెల్లడించారు.
సమస్య ఏంటంటే..
మోహన్‌బాబు యూనిర్సిటీల్లో ఫీజులు, ఇతర ఖర్చుల పేరుతో పిల్లలను వేధిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏఐసీటీఈకి ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా ఏఐఎస్‌ఎఫ్ కూడా రంగంలోకి దిగింది. అయితే ఆందోళనలపై ఇప్పటి వరకు యజమాని మోహన్ బాబు కానీ, కాలేజీ వ్యవహారాలు చూసుకుంటున్న మంచు విష్ణుగానీ స్పందించలేదు. ఆరోపణలపై ఇద్దరూ సైలెంట్‌గా ఉన్న సమయంలో మనోజ్ రంగంలోకి దిగారు. తెలివిగా ట్వీట్ చేశారు. తన తండ్రి ఉన్నత ఆశయంతో, విలువలతో విద్యా సంస్థ స్థాపించారని తెలిపారు. దీనిని ప్రస్తుతం విష్ణు చూస్తున్నాడు కాబట్టి.. అంతా మోహన్ బాబుకు తెలియకుండా జరుగుతోందని చెప్పడం ద్వారా మనోజ్ పరోక్షంగా అన్నను టార్గెట్ చేశాడు. ట్వీట్‌లో ఎక్కడా విష్ణు ప్రస్తావన తీసుకు రాలేదని కానీ.. విద్యార్థులకు పేరెంట్స్‌కు తన మద్దతు ఉంటుందని చెప్పడం మాత్రం చిన్న విషయం కాదు. మనోజ్ ట్వీట్ పై మంచు ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడ ఆసక్తిగా మారింది.
Raj Sekhar is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Manoj who targeted manchu vishnu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com