Manoj Bajpayee: హిందీ సినిమా పరిశ్రమ అదుపు తప్పింది. ఆ అదుపు తప్పిన హిందీ సినిమాలకు “కాపు” కాసే దర్శక నిర్మాతలు కరువు అయ్యారు. మరోపక్క ప్రపంచ సినీయవనికపై సౌత్ సినిమా ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ సౌత్ దర్శక నిర్మాతలు ముందుకు పోతున్నారు. నిజానికి ప్రస్తుతం హిందీ సినిమా వ్యాపార ధోరణి పేరుతో అదుపుతప్పి విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే.. సౌత్ సినిమా మాత్రం బాక్సాఫీస్ కి కాపు కాసిన ఆపద్భాందవుడు అవతారం ఎత్తింది.

దీనికి తోడు హిందీలోకి డబ్ అయిన దక్షిణాది సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ అక్కడ కూడా భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే ‘బాహుబలి’, ‘కెజియఫ్: చాప్టర్-1’, ‘బాహుబలి-2’, ‘పుష్ప’ వంటి సినిమాలు హిందీ తెర పై బంపర్ కలెక్షన్లను కొల్లగొడుతూ సరికొత్త రికార్డులను నమోదు చేశాయి.
Also Read: Hero Nikhil: కన్నీళ్లు పెట్టుకుంటూ మెసేజ్ చేసిన క్రేజీ హీరో !
అందుకే.. ఇప్పుడు సౌత్ సినిమాలు అంటే.. హిందీ స్టార్ హీరోలు కూడా ఉలిక్కి పడుతున్నారు. అందుకే.. సౌత్ సినిమాల బ్లాక్‌బాస్టర్ సక్సెస్‌ను చూసి బాలీవుడ్ భయపడుతోందని హిందీ నటులే కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు.
మనోజ్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. ‘ఆర్‌ఆర్ఆర్’, ‘కెజియఫ్: చాప్టర్-2’ల విజయాన్ని చూసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ భయపడుతున్నారు. ఈ సినిమాల సక్సెస్‌తో వారికి వెన్నులో వణుకు పుట్టింది. ప్రస్తుతం ఎటువంటి చిత్రాలను నిర్మించాలో వారికీ తెలియడం లేదు’’ అంటూ మనోజ్ బాజ్‌పాయ్ తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశాడు.

ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మనోజ్ బాజ్‌పాయ్ కావాలని ఈ రోజు మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఈ ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు. మొత్తానికి కావాలని ప్రెస్ మీట్ పెట్టి మరీ మనోజ్ బాజ్‌పాయ్ పై విధంగా మాట్లాడాడు. అలాగే మనోజ్ బాజ్‌పాయ్ ఇంకా మాట్లాడుతూ..‘‘సౌత్ వారు ప్రతి షాట్‌ను చాలా తపనతో తెరకెక్కిస్తారు. అన్నిటికీ మించి ఒక్కసారి కూడా ప్రేక్షకులను తక్కువ చేసి వారు మాట్లాడరు. ఆడియన్స్‌కు అర్థం కాదు అనే మాటలను వారు చెప్పరు. ముంబై ఫిలిం ఇండస్ట్రీలోని ఫిల్మ్ మేకర్స్ సౌత్ వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి’’ అని మనోజ్ చెప్పుకొచ్చాడు.
Also Read:Zee Telugu Saregamapa 2022: సరిగమప షో: అదిరిపోయిన సింగర్స్, సూపర్ సింగర్స్ జోడీ.. ఎన్నో ఎమోషన్స్
Recommended Videos: