Ponniyin Selvan Collections: సౌత్ ఇండియా లో బాహుబలి రేంజ్ భారీ బడ్జెట్ తో అదే స్థాయి అంచనాలతో విడుదలైన సినిమా ‘పొన్నియన్ సెల్వన్’..పొన్నియన్ సెల్వన్ అనే నోవెల్ బుక్ ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు..ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అని ఎన్నో సందర్భాలలో తెలిపాడు కూడా..తమిళనాడు ప్రేక్షకులు ఈ సినిమాని తమ గర్వకారణం కి ప్రతీకగా తీసుకున్నారు..దానికి తోడు తమిళ టాప్ హీరోలైన విక్రమ్ , కార్తీ మరియు జయం రవి వంటి వారితో పాటు ఐశ్వర్య రాయి మరియు త్రిష వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఈ సినిమాలో నటించడం తో అంచనాలు తారాస్థాయికి చేరాయి..అందుకే ఈ చిత్రం మొదటి రోజు కాస్త డివైడ్ టాక్ తెచుకున్నప్పటికీ కూడా వసూళ్ల పరంగా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో సంచలన రికార్డుని సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతుంది..ముఖ్యంగా తమిళనాడు లో అయితే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కచ్చితంగా కొడుతుందట..విడుదలై మూడు రోజు పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఈ మూడు రోజులకు కలిపి ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూద్దాము.

మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించింది..ఇది సౌత్ ఇండియాలోనే ఆల్ టైం టాప్ 10 డే 1 హైయెస్ట్ గ్రాస్సర్స్ లో ఒకటి అని చెప్పొకోవచ్చు..తెలుగు ఈ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దాదాపుగా 10 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు..టాక్ కాస్త డివైడ్ రావడం తో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో అని డిస్ట్రిబ్యూటర్స్ కాస్త భయపడ్డారు..కానీ ఈ చిత్రం తోలి మూడు రోజుల్లోనే తెలుగు లో 8 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది..బ్రేక్ ఈవెన్ కి మరో రెండు కోట్ల రూపాయిలు వసూలు చెయ్యాల్సి ఉండగా.

దసరా రోజుకి కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కుని చేరుకుంటుంది అని ఆశిస్తున్నారు..ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అన్ని భాషలకు కలిపి మూడు రోజుల్లో 200 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు 103 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఉంటుందని ట్రేడ్ పండితుల అంచనా..డివైడ్ టాక్ వస్తే ఈ స్థాయి వసూళ్లను రాబట్టింది అంటే..బాహుబలి సిరీస్ రేంజ్ టాక్ వస్తే ఇక ఏ రేంజ్ లో ఉండేదో అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.