https://www.youtube.com/watch?v=kGfkL50mz5A
మంగ్లీ.. ఈ అచ్చ తెలంగాణ గాయని పాడిన పాటలు తెలంగాణ శ్రోతలకు వీనుల విందుగా ఉంటాయి. ఆమె బతుకమ్మ, దసరా, సంక్రాంతికి, తెలంగాణ ఆవిర్భావానికి చేసిన పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి.
ఇక ఈ క్రమంలోనే సినిమాల్లోనూ ఈ మధ్య పాటలు పాడుతూ హోరెత్తిస్తోంది. ‘అల వైకుంఠపురంలో’, ఇతర టాప్ సినిమాల్లో మంగ్లీ పాటలు పాడుతూ హోరెత్తిస్తోంది. ఆమె పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ గా ఉన్నాయి.
తాజాగా తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా జూలై 11న తన యూట్యూబ్ చానెల్ లో మంగ్లీ ఒక పాటను విడుదల చేసింది. ‘చెట్టుకింద కూసున్నవమ్మా’ అంటూ సాగే ఈ పాట వివాదాస్పదమైంది.
అమ్మావారిని పొగుడుతున్నట్టు కాకుండా తిడుతున్నట్టు పాటలోని పదాలు ఉండడంతో దుమారం రేగింది. పాటను పొగుడుతూ రాశారా? లేక అవమానించడానికి ఈ పాటను రూపొందించారా? అని పలువురు మంగ్లీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
అయితే మంగ్లీని అనడానికి ఏం లేదని.. కేవలం ఆమె పాడి , డ్యాన్స్ చేసిందని.. రామస్వామి రాసిన పాటకి రాకేష్ వెంకటాపురం సంగీతం అందించారని.. దామురెడ్డి దర్శకత్వం వహించారని.. వాళ్లు బాధ్యులేనని అంటున్నారు.