Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు.. ఎన్నో మలుపులు.. మరెన్నో ఆరోణలు.. మొత్తానికి ప్రకాష్ రాజ్ పై మంచి ఆధిక్యంతో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచాడు. చిరంజీవి లాంటి వ్యక్తికి వ్యతిరేఖంగా పోటీ చేసి గొప్ప విజయమే సాధించాడు. కానీ విష్ణు సినిమాల్లో ఆశించిన మేర విజయం సాధించలేకపోయాడు. మార్కెట్ పరంగా విష్ణు సినిమాలు ఎప్పుడో వెనక పడిపోయాయి. అయినా మా ఎన్నికల పై విష్ణు ముచ్చట పడి గెలిచాడు.

గెలిచాక పెట్టిన ప్రెస్ మీట్ లో విష్ణు ఫుల్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడాడు. కానీ, విష్ణు గెలుపు పై ఇండస్ట్రీ ఏమనుకుంటుంది ? ఎన్నికల్లో అయితే గెలిచాడు, కానీ ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి ? అంతా బాగుంది, బాగుంటుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే విష్ణు ఇచ్చిన హామీలను పూర్తి చేయాలి అంటే.. కోట్ల రూపాయలు కావాలి.
అసలు ఒక కుటుంబానికి అన్నీ రకాల సాయం చేస్తానని ప్రకటించాడు. అది సాధ్యమేనా ? విష్ణుకు ముందుంది ముసళ్ల పండుగ అని ఇండస్ట్రీ జనాలు కూడా అంటున్నారు అంటే.. అది విష్ణు ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకునే. అందుకే కచ్చితంగా చెప్పొచ్చు విష్ణుకు సవాళ్లు మొదలైపోయాయని. మరి విష్ణు సాధించిన విజయానికి విలువ లేదా ?
ఈ వ్యవహారాన్ని విష్ణు ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. అయితే, చిరును, మెగా హీరోలను కాదని, ధిక్కరించి విష్ణు ముందుకెళ్తే ఫండింగ్ ఎక్కడ నుంచి వస్తోంది ? కాకపోతే, విష్ణుకు ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ సపోర్ట్ ఉంది. కాబట్టి ఫండింగ్ కి పెద్ద సమస్య కాకపోవచ్చు. అయితే ‘మా’ ప్రతిష్ఠ ఎంతగా దెబ్బ తిందో అందరికి తెలిసిందే. అలాంటి ‘మా’ ను ఇప్పుడు ఉన్నత స్థితిలో పెట్టాలి అంటే.. డబ్బు ఒక్కటే సరిపోదు.
అందర్నీ కలుపుకుని పోవాలి. కలుపుకుని పోయినా కలిసి వచ్చేలా కనబడటం లేదు. చిరు మద్దతిచ్చిన ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో ఓడిపోవడం చిరంజీవి సన్నిహితులు, అభిమానులు అయినా కొందరు సినీ ప్రముఖులు జీర్ణయించుకోవడం లేదు. మరి వారంతా ‘మా’ వ్యవహారాల్లో ఏ మేర జోక్యం చేసుకుంటారనేది సందేహమే.