
Manchu Manoj : మంచు మనోజ్ అన్నయ్య విష్ణు మీద తీవ్ర అసహనంతో ఉన్నాడన్న మాట నిజం. దానికి ఆయన చర్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. విష్ణుతో జరిగిన గొడవకు సంబంధించిన వీడియో నేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అతిపెద్ద చర్చకు మనోజ్ కారణమయ్యాడు. విష్ణు మీద ఆరోపణలు చేస్తూ మనోజ్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. కుటుంబ గొడవలు పబ్లిక్ కి తెలిసేలా చేసి పరువు బాజారుకీడ్చారని మోహన్ బాబు ఫైర్ అయ్యారని సమాచారం. ఇద్దరు కొడుకులతో మీటింగ్ ఏర్పాటు చేసి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నారని కథనాలు వెలువడ్డాయి.
అయితే ఆ సూచనలు కనిపించడం లేదు. మనోజ్ వివాదం మరింత పెద్దది చేస్తున్నాడు. ఆయన పరోక్షంగా విష్ణు మీద సెటైర్స్ వేస్తున్నారు. మనోజ్ ట్విట్టర్ వేదికగా రెండు కోట్స్ షేర్ చేశారు. మంచి గురించి పోరాడి చనిపోవడం ఉత్తమం, చెడును సహిస్తూ బ్రతకడం కంటే చావడం మేలంటూ… ఓ ట్వీట్ చేశాడు. అదే ట్వీట్లో ‘క్రియేటివిటీని నెగిటివిటీ చంపేస్తుంది’… అంటూ మరో కోట్ పొందుపరిచారు. ఈ రెండు కోట్స్ తో పాటు ‘బ్రతకండి ఇతరులను బ్రతకనివ్వండి’ అని కామెంట్ రాశారు.
మనోజ్ చేస్తున్న ఈ కామెంట్స్ మొత్తం విష్ణును ఉద్దేశించే అని టాలీవుడ్ వర్గాల వాదన. అసలు మనోజ్ అంతగా సహనం కోల్పోవడానికి విష్ణు ఏం చేశాడు, ఇద్దరి మధ్య గొడవకు కారణాలు ఏమిటనే చర్చ విపరీతంగా జరుగుతుంది. కొన్ని నెలలుగా మనోజ్-విష్ణు డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్నారు. కుటుంబం మీద అలిగిన మనోజ్ ఇంటికి దూరంగా ఉంటున్నాడన్న ప్రచారం జరిగింది. అలాగే భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం, విష్ణుకు ఇష్టం లేదని వార్తలు వెలువడ్డాయి. కారణాలు ఏవైనా గొడవైతే చిన్నది కాదు. జనాలు ఏమనుకున్నా పర్లేదు… గొడవ గురించి అందరికీ తెలియాలని మనోజ్ డిసైడ్ అయ్యాడు.
మంచు ఫ్యామిలీలో ఏర్పడిన ఈ భూకంపం గురించి అక్క లక్ష్మి స్పందించారు. ప్రతి కుటుంబంలో చిన్నా చితకా మనస్పర్థలు ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఏర్పడిన చిన్న వివాదంగా దీన్ని చూడాలి కానీ… రాద్దాంతం చేయడం సరికాదు. అసలు ఏం జరిగిందో తెలియకుండా తమకు ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారని ఆమె అన్నారు. త్వరలో వివాదం పరిష్కారం అవుతుందంటూ ఆమె జోస్యం చెప్పారు. కాగా మంచు లక్ష్మిని రెండు నెలల క్రితం ఇదే ప్రశ్న అడిగితే అవన్నీ పుకార్లు అన్నారు. ఇప్పుడు గొడవలు ఉన్నాయి. ఇవి ప్రతి కుటుంబంలో కామన్ అంటున్నారు. మునుముందు మంచి బ్రదర్స్ వార్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
Live and let live 🙏🏼❤️ Love you all with all my heart. #ManchuManoj pic.twitter.com/ypecRuZwLG
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 25, 2023