https://oktelugu.com/

Manchu Manoj : భార్య కోసం ప్రాణమిస్తాను అంటున్న మంచు మనోజ్..

మా కుటుంబానికి మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నా భార్య మణికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు నా హృదయంలో, ఆత్మలో అత్యంత విలువైన భాగం.. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. ఇట్లు మను అంటూ తన భార్య మంచు మనోజ్ మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం మీద మంచు మనోజ్ కు భార్యమీద ఉన్న ప్రేమను తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.

Written By:
  • NARESH
  • , Updated On : March 4, 2024 / 01:14 PM IST
    Follow us on

    Manchu Manoj : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న మంచు మనోజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వృత్తి పరంగా, వైవాహిక జీవితంలో మనోజ్ చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. ఒకప్పుడు ఈయన నటించే సినిమాలు మంచి సక్సెస్ ను సాధిస్తుండేవి. కానీ ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు మనోజ్. అయితే గతేడాది మార్చి 3న భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

    అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇక వీరి వివాహం జరిగి ఏడాది కావడంతో తమ వెడ్డింగ్ యానివర్సరీని మనోజ్ దంపతులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే మనోజ్ సోషల్ మీడియా వేదికగా తన భార్య మౌనిక, కుమారుడు ధైరవ్ తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా చేస్తూ భార్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎమోషనల్ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

    నా ప్రియమైన భార్య భూమా మౌనికకు మొదటి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రతిరోజు ప్రేమ ఆనందంతో కూడిన ప్రయాణం ఇది. నీ రాక నా జీవితాన్ని అసాధారణంగా మార్చివేసింది అంటూ రాసుకొచ్చారు మంచు మనోజ్. మీ తల్లిదండ్రులు లేని లోటును భర్తీ చేయలేను. వారి జీవితంలో అత్యంత విలువైన వారిని సంరక్షిస్తానని, వాగ్దానం చేస్తున్నాను. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నా ప్రాణాలను ఫణంగా పెట్టి మిమ్మల్ని కాపాడుతానని మాట ఇస్తున్నాను అంటూ రాసుకొచ్చాడు.