Manchu Lakshmi: హీరోయిన్ కావాలని పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేస్తుంది మంచు లక్ష్మి. ఆమె లేటెస్ట్ మూవీ అగ్ని నక్షత్రం. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. కారణం తెలియదు కానీ విడుదల తేదీ ప్రకటించలేదు. అలాగే ఎలాంటి అప్డేట్ లేదు. దర్శకుడు వంశీ కృష్ణ మల్ల అగ్ని నక్షత్రం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మంచు లక్ష్మి స్వయంగా నిర్మించారు. మోహన్ బాబు కూడా ఓ కీలక రోల్ చేస్తున్నారట. మంచు లక్ష్మి ఈ మూవీతో హిట్ కొట్టి ఫేమ్ రాబట్టాలని కోరుకుంటున్నారు.
గతంలో మంచు లక్ష్మి గుండెల్లో గోదారి, లక్ష్మీ బాంబ్, దొంగాట వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రాలన్నీ నిరాశపరిచాయి. దాంతో ఆమెకు గుర్తింపు రాలేదు. సొంత నిర్మాణ సంస్థలు చిత్రాలు చేస్తూ ఆమె హీరోయిన్ కావాలనే ప్రయత్నం చేస్తుంది. అలాగే మంచు లక్ష్మి ఫేమ్ కోసం గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా స్కిన్ షో చేస్తుంది. తాజాగా వైట్ షర్ట్ అండ్ ప్యాంటు ధరించి స్టైలిష్ ఫోజులో అదరగొట్టింది.
మరోవైపు మంచు ఫ్యామిలీలో విబేధాలు కొనసాగుతున్నాయి. విష్ణు, మనోజ్ మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఆస్తుల పంపకాలు, మనోజ్ రెండో పెళ్లి ఈ గొడవలకు కారణమని సమాచారం. మనోజ్ ఇటీవల భూమా మౌనికను వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లిని విష్ణు బహిష్కరించారు. మోహన్ బాబు కూడా అన్యమనస్కంగానే ఒప్పుకున్నారు. పెళ్ళికి హాజరయ్యారు. మనోజ్ పెళ్లి బాధ్యత అక్క మంచు లక్ష్మి తీసుకుంది. తన నివాసంలో మూడు రోజులు మనోజ్ వివాహం ఘనంగా జరిగింది.
విష్ణుకు మనోజ్ తో పాటు మంచు లక్ష్మి కూడా దూరమయ్యారని వినికిడి. విష్ణు ఒకవైపు మనోజ్, లక్ష్మి మరొక వైపు ఉన్నారట. మోహన్ బాబు శ్రీవిద్యా నికేతన్ బాధ్యతలు మనోజ్ కి అప్పగించారు. ఇది కూడా మంచు బ్రదర్స్ మధ్య గొడవలకు కారణం కావచ్చు. అన్నదమ్ముల మధ్య గొడవలపై మంచు లక్ష్మి ఒకటి రెండు సందర్భాల్లో స్పందించారు. ఇవి ప్రతి కుటుంబంలో ఉండేవే, బూతద్దంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.
View this post on Instagram