Manchu Lakshmi: ‘మా’ అధ్యక్ష పదవిని మంచు ఫ్యామిలీ ప్రత్యేకంగా ట్రీట్ చేస్తుంది. ‘మా’ అధ్యక్షడిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత మంచు విష్ణు సభలకు గుళ్ళు గోపురాలకు వెళ్తున్నాడు. తాజాగా తన అక్క మంచు లక్ష్మితో పాటు తన ప్యానల్ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఈ సందర్భంగా మంచు లక్ష్మి, పవన్ కళ్యాణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తో పాటు విష్ణు కూడా వెళ్ళాడు. అయితే, ఈ అలయ్ బలయ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, విష్ణు ఎడమొహం పెడమొహంగా కూర్చున్నారు. దాంతో మీడియా ఈ అంశంపై అనేక కథనాలు రాసింది. మరోపక్క పవన్ ఫ్యాన్స్ కూడా.. ‘విష్ణుకి సరైన గుణపాఠం చెప్పాడు మా హీరో’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి ఈ అంశం మంచు లక్ష్మి దృష్టికి వెళ్ళింది. అందుకే, ప్రత్యేకంగా ఈ విషయంపై వివరణ ఇచ్చింది. పవన్ కళ్యాణ్, విష్ణు ఎడమొహం పెడమొహంగా లేరు అని, ఇద్దరూ చాలా సేపు పలు అంశాల పై మాట్లాడుకున్నారని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. అయితే, పవన్ కళ్యాణ్, విష్ణు వేరు వేరుగా ఉన్న ఒక ఫోటో తీసుకుని.. కొంతమంది సోషల్ మీడియాలో ఏవేవో కథలు అల్లేస్తున్నారని మంచు లక్ష్మి సీరియస్ అయింది. మొత్తానికి మంచు లక్ష్మీ మళ్లీ పవన్ కళ్యాణ్ ను తమలో కలిపేసుకుంది.
ఇక చివరిగా మంచు లక్ష్మి మరో స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. ‘మాలో మాకు విబేధాలు లేవు. మేమంతా ఒకటే’ అనే నినాదాన్ని అందుకుంది. మంచు లక్ష్మి ఏం మాట్లాడినా ప్రత్యేకంగానే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు నెటిజన్లకు తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ ఉంటుంది లక్ష్మి. ఈ క్రమంలోనే నెటిజన్ల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది.
Also Read: Rashmi: యాంకర్ రష్మీని ఇలా బుక్ చేశాడేంటి?
ఇక తిరుమలలో మంచు లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ .. ‘ఈ రోజు ‘మా’ నూతన కార్యవర్గం శ్రీవారిని దర్శంచుకుంది. వారంతా తాము అనుకున్న పనులను సమర్థవంతంగా పూర్తి చేయడానికి తగిన బలం ఇవ్వమని ఆ స్వామివారిని కోరుకున్నారు. ఇక మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘మా’ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్తాను. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు నూతన భవన నిర్మాణం పై మూడు నెలల్లో స్పష్టత ఇస్తాను’ అని విష్ణు చెప్పుకొచ్చారు.
Also Read: Megastar Chiranjeevi: మెగాస్టార్ ఫాదర్ గా ఆ సీనియర్ నటుడు !