Mana Shankara Varaprasad Garu Pre Release Event: నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో జరిగిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మెగా(Megastar Chiranjeevi) అభిమానులు, విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు. మూవీ లవర్స్ కి కూడా నిన్నటి ఈవెంట్ ఒక పండుగ లాంటిది. ఆద్యంతం అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ తో ఈ ఈవెంట్ సాగిపోయింది. నిన్నటి ఈవెంట్ లోనే ఈ సినిమాలోని చివరి పాట ‘Hook Step’ ని విడుదల చేశారు. ఈ పాటకు అక్కడికి వచ్చిన అభిమానుల నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. పాట LED స్క్రీన్ మీద ఉన్నంత సేపు అభిమానులు శిల్ప కళా వేదిక మొత్తం హోరెత్తిపోయేలా చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన కంటెంట్ ఒక ఎత్తు అయితే, నిన్న విడుదల చేసిన పాట మరో ఎత్తు, మెగాస్టార్ నుండి ఎలాంటి స్టెప్పులను మనం ఆశిస్తామో, అలాంటి స్టెప్పులు వేయించాడు అనిల్ రావిపూడి.
ఈ పాటలోని బీట్, ఎనర్జీ కి అభిమానులు ఒక రేంజ్ లో వైబ్ అవుతున్న సమయం లో విక్టరీ వెంకటేష్ లో కూడా ఒక ఊపు వచ్చింది. వెంటనే కూర్చున్న మనిషి పైకి లేచి స్టెప్పులు వేసాడు. వెంకటేష్ తో పాటు పక్కనే ఉన్న అనిల్ రావిపూడి కూడా స్టెప్పులు వేసాడు. వీళ్లిద్దరు కలిసి అలా స్టెప్పులు వేస్తుంటే మనం మన స్నేహితులతో సంతోషంగా ఉన్న సమయం లో ఎలా డ్యాన్స్ వేసి ఎంజాయ్ చేసేవాళ్ళమో గుర్తుకొస్తాది. చిరంజీవి కూడా పైకి లేచి స్టెప్పులు వేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆయన మోకాళ్ళకు సర్జరీ జరగడం వల్ల పైకి లేచి డ్యాన్స్ వేయలేకపోయారు కానీ, కూర్చొనే చేతులతో డ్యాన్స్ మూవ్మెంట్స్ వేసాడు. ఒక రేంజ్ ఎనర్జీ ని నింపిన ఈ మూమెంట్ కి సంబంధించిన వీడియో ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూసి ఎంజాయ్ చేయండి, ఇలాంటి సందర్భాలు మళ్లీ మళ్లీ రావు.
B,C centers tagalapadipotai e song ki@VenkyMama ty venky mama Love u
Hyped up Bossu @KChiruTweets like never before❤️#HookStep #ManaShankarVaraPrasadGaru https://t.co/Le4VEjD90p pic.twitter.com/1pm4oEQBZG— P̅sycɦ (@CherryMegaholic) January 7, 2026