Mana Shankara Varaprasad Garu: మరో 5 రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) హీరో గా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం విడుదల కాబోతున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిరంజీవి, వెంకటేష్ లతో పాటు మూవీ యూనిట్ మొత్తం హాజరైంది. ఈ ఈవెంట్ లో సినిమాలో మిగిలిపోయిన చివరి పాటను కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ‘హుక్ స్టెప్’ అంటూ మొదలయ్యే పాటకు ఎనర్జిటిక్ ట్యూన్ ని అందించాడు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్. ఆ ఎనర్జిటిక్ ట్యూన్ కి మెగాస్టార్ చిరంజీవి వేసిన స్టెప్పులు చూసి, ఫ్యాన్స్ కి మతి పోయింది. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒకప్పుడు ‘హుక్ స్టెప్’ అనే కాన్సెప్ట్ ని పరిచయం చేసిందే మెగాస్టార్ చిరంజీవి. అదే ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ రూపం లో ట్రెండ్ అవుతూ ఉన్నాయి.
ప్రతీ హీరో తమ సినిమాలో హుక్ స్టెప్స్ ఉండేలా పాటలను కంపోజ్ చేయించుకుంటున్నారు, అదే విధంగా డ్యాన్స్ మాస్టర్స్ తో కొరియోగ్రఫీ కూడా చేయించుకుంటున్నారు. ఇక నేడు విడుదల చేసిన ‘హుక్ స్టెప్’ లిరికల్ వీడియో సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి వేసిన స్టెప్పులు నేటి తరం హీరోలు కూడా వేయలేకపోతున్నారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. చిరంజీవి కి ప్రస్తుతం 70 ఏళ్ళ వయస్సు. గత కొంతకాలం నుండి ఆయన తీవ్రమైన మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నాడు. రెండు నెలల క్రితమే సర్జరీ చేయించుకోవాల్సి ఉండగా, ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ మూవీ షూటింగ్ కి అంతరాయం కలగకూడదని, సంక్రాంతి మిస్ అవ్వకూడదనే కసితో ఈ సినిమాని చేసాడు. రీసెంట్ గానే ఆయన మోకాళ్ళకు సర్జరీ కూడా చేయించుకున్నాడు. అంత నొప్పి తో కూడా ఈ వయస్సులో ఆయన వేసిన స్టెప్పులు చూసి సెల్యూట్ చేయాల్సిందే. సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ డ్యాన్స్ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఈ పాటకు ఆట సందీప్ కొరియోగ్రఫీ చేసాడు. ఇక చాలా కాలం తర్వాత బాబా సెహగల్ ఈ పాటకు తన గాత్రాన్ని అందించాడు.