Site icon OkTelugu

Mana Shankara Varaprasad Garu Collection: ‘మన శంకర వరప్రసాద్ గారు’ 4 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు..28వ రోజు చరిత్ర తిరగరాసిన మెగాస్టార్!

Mana Shankara Varaprasad Garu Collection

Mana Shankara Varaprasad Garu Collection

Mana Shankara Varaprasad Garu Collection: ఈ ఏడాది సంక్రాంతి విజేతగా నిల్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం చూస్తూ ఉండగానే నాలుగు వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ద్వారా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సినిమాకు టాక్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ఏ రేంజ్ లో బ్రహ్మరథం పడుతారో నేటి తరం ఆడియన్స్ కి అర్థం అయ్యేలా చేసింది. చాలా మంది స్టార్ హీరోలకు కూడా సాధ్యం అవ్వని రన్ ని ఈ చిత్రం సొంతం చేసుకోవడం గమనార్హం. 70 ఏళ్ళ వయస్సులో కూడా మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని నేటి తరం స్టార్ హీరోలతో సరిసమానంగా క్రియేట్ చేయడం చిన్న విషయం కాదు. 300 కోట్ల గ్రాస్ మార్కుకి అతి చేరువలో ఉన్న ఈ చిత్రం, 28 వ రోజున కూడా హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకుంది.

ట్రేడ్ పండితులు అందిస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రం 28వ రోజున ప్రపంచవ్యాప్తంగా కోటి 50 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. గత వారం విడుదలైన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం కూడా చూపకపోవడం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది చెప్పొచ్చు. ఇక షేర్ వసూళ్లు 28వ రోజున 75 లక్షల రూపాయలకు పైగానే ఉందని, కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఓవరాల్ గా నాలుగు వారాలకు కలిపి ప్రాంతాల వారీగా ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి నాలుగు వారాల్లో 47 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి 23.12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 22.73 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

తూర్పు గోదావరి జిల్లా నుండి 15.6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 10.10 కోట్లు, గుంటూరు జిల్లా నుండి 11.32 కోట్లు, కృష్ణా జిల్లా నుండి 11.10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక నెల్లూరు జిల్లాలో అయితే ఈ చిత్రం ఏకంగా 6.9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో కచ్చితంగా 7 కోట్ల మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా ఈ చిత్రానికి 4 వారాల్లో తెలుగు రాష్ట్రాల నుండి 148.13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 229 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి 181 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 298.65 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోబోతుంది.

Exit mobile version