Mana Shankara Varaprasad Garu Collections: ఈ సంక్రాంతికి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటిందని నిర్మాతలు చెప్పుకొచ్చారు కానీ, ఫుల్ రన్ లో కూడా ఇప్పుడు 300 కోట్ల గ్రాస్ వసూళ్లు వాస్తవ రూపం లో రావడం కష్టమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 12 రోజులకు గాను ఈ చిత్రానికి 258 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 12 వ రోజున ఈ చిత్రానికి కేవలం కోటి 34 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అది కూడా రిటర్న్ జీఎస్టీ తో కలిపి. ఈ ట్రెండ్ ని చూస్తుంటే ఈ చిత్రం ఫుల్ రన్ లో 300 కోట్ల మార్కుని అందుకోవడం కష్టమని అనిపిస్తోంది. నేడు ఈ చిత్రానికి అన్ని ప్రాంతాల్లోనూ వసూళ్లు పుంజుకున్నాయి. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం నేడు ఈ చిత్రానికి 3 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు రావొచ్చు.
అంటే గ్రాస్ దాదాపుగా 6 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు. రేపు కూడా ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు దంచి కొట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎంత వసూళ్లు రాబట్టిన 4 నుండి 4.5 కోట్ల రూపాయిల రేంజ్ లోనే షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గ్రాస్ వసూళ్లు 9 కోట్ల రూపాయిల వరకు తెలుగు రాష్ట్రాల నుండి ఉండొచ్చు. వరల్డ్ వైడ్ గా పది కోట్ల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక సోమవారం రోజున రిపబ్లిక్ డే అవ్వడం తో, నేషనల్ హాలిడే కారణంగా ఆరోజు కూడా ఈ చిత్రానికి మరో 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ఓవరాల్ గా ఈ చిత్రానికి జనవరి 26 వ తేదీ పూర్తి అయ్యే సరికి 282 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్ల మార్కుని అందుకుంటుంది.
అక్కడి నుండి మరో 18 కోట్ల గ్రాస్ వసూళ్లు రావడం కష్టమని అంటున్నారు. అంటే ఈ చిత్రం ఫుల్ రన్ లో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ క్లోజింగ్ కలెక్షన్స్ ని అందుకోవడం దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. కానీ ప్రాంతీయ బాషా చిత్రాల్లో మాత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ కలెక్షన్స్ ని దాటి, రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా ఈ చిత్రం నిలిచిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే ఫుల్ రన్ లో ఈ చిత్రం 290 నుండి 295 కోట్ల రూపాయిల గ్రాస్ మధ్యలో ఆగేలా ఉంది. వచ్చే వారం కూడా ఈ చిత్రం అందరి అంచనాలను దాటుతూ డీసెంట్ వసూళ్లను నమోదు చేసుకుంటే మాత్రం కచ్చితంగా 300 కోట్ల మార్కుని అందుకోవచ్చు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.