Ram Charan మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో… కియారా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని… శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతుంది. ఇందులో చరణ్ ఓ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. ఆ అధికారి తర్వాత రాజకీయ నాయకుడిగా మారితే రాజకీయ వ్యవస్థలో ఏ మార్పులు తెస్తాడు అనే కథాంశంతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇందులో ప్రధాన విలన్ గా మలయాళం స్టార్ సురేష్ గోపీని తీసుకునేందుకు ఆలోచన చేస్తున్నారంట మూవీ యూనిట్. త్వరలోనే అదికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. శంకర్ సినిమా అంటే నిర్మాణంలో ఎక్కడా రాజీ ఉండదు. అలానే సినిమాలో రిచ్ నెస్ ని కచ్చితంగా చూపిస్తారు. శంకర్ మార్క్ చిత్రంగా నిలుస్తుందని తెలుస్తోంది. ఇందులో శ్రీకాంత్, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.