Akhanda 2 Movie Release Date: ‘ నందమూరి బాలకృష్ణ(Nandamuri |Balakrishna) హీరో గా నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం విడుదలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. డిసెంబర్ 5న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, కొన్ని ఆర్ధిక ఇబ్బందుల కారణంగా వాయిదా పడింది. మరికాసేపట్లో ప్రీమియర్ షోస్ మొదలు అవ్వబోతున్నాయి అనగా, వాయిదా వేయడం తో అభిమానులు శోకసంద్రం లో మునిగిపోయారు. సోషల్ మీడియా లో వచ్చే కథనాలు చూసి, అసలు ఈ సినిమా ఇప్పట్లో విడుదల అవుతుందా అనే సందేహాలు ఫ్యాన్స్ లో వ్యక్తం అయ్యాయి. కానీ EROS సంస్థ తో ఒక ఒప్పందానికి వచ్చిన నిర్మాతలు, మద్రాసు హైకోర్టు ని ఆశ్రయించగా, ఈ చిత్రం విడుదలకు క్లియరెన్స్ మంజూరు చేసింది. దీంతో నిర్మాతలు లోకల్ బయ్యర్స్ తో మాట్లాడుకొని, పెండింగ్ అమౌంట్ విషయం లో చర్చలు జరిపి ఈ నెల 12 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు నిన్న రాత్రి అధికారిక ప్రకటన చేశారు.
ఈ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్ ని పెంచుతూ ప్రభుత్వం జీవో ని జారీ చేసింది. ఇక తెలంగాణ అడ్వాన్స్ బుకింగ్స్ కి సంబంధించి టికెట్ రేట్ జీవో రావాల్సి ఉంది. రేపు సాయంత్రం లోపు జీవో వచ్చేస్తుందని ఆశిస్తున్నారు. రేపు ఒక శుభ ముహూర్తం లో ప్రీమియర్స్ + మొదటి రోజు కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని బుక్ మై షో మరియు డిస్ట్రిక్ట్ యాప్స్ లో మొదలు పెట్టనున్నారు. ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న నందమూరి ఫ్యాన్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఏ రేంజ్ గ్రాస్ ని పెట్టబోతున్నారో చూడాలి. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ పైన మాత్రం అభిమానులు ఆశలు వదిలేసుకోవాల్సిందే. టాక్ వస్తే మొదటి రోజు నుండి వసూళ్లు బాగుంటాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాలి.
ఈ రేంజ్ వసూళ్లు రావడం అనేది చిన్న విషయం అయితే కాదు. మొదటి రోజు దాదాపుగా వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడితేనే ఈ రేంజ్ గ్రాస్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే మొదటి రోజు ఈ చిత్రానికి 40 కోట్ల గ్రాస్ వసూళ్లు రావడం కూడా కష్టమే. ఆ 40 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ రావాలన్నా కూడా పాజిటివ్ టాక్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ పాజిటివ్ టాక్ ఈ చిత్రానికి రావడం కష్టమే. ఎందుకంటే ఇలాంటి సినిమాలను ఈమధ్య కాలం లో ఆడియన్స్ ఆదరించడం లేదు. ఇప్పుడంతా సలార్, ఓజీ తరహా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇవి కాకుండా, భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలను అయితే జనాలు పాజిటివ్ టాక్ రాకపోయినా ఆదరిస్తున్నారు. మరి ‘అఖండ 2’ పరిస్థితి ఏంటో చూడాలి.