Major: అడవి శేషు హీరోగా వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తోన్న సినిమా మేజర్. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మూడు భాషల్లో రూపొందించిన ఈ సినిమా.. 120 రోజుల పాటు షూటింగ్ జరిగింది. సుమారు 75 లొకేషన్లలో షూటింగ్ జరపగా.. అందులో 8 సెట్లు ప్రత్యేకంగా నిర్మించారు. తాజాగా , ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆడియో రైట్స్‌ను జీ మ్యూజిక్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని అడవి శేషు స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు.
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ముంబయి 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలతో పాటు, ఆయన చన్ననాటి జీవితం నుండి ప్రతి చిన్ని సంఘటనను ఈ సినిమాలో చూపించనున్నారు. శశికిరణ్ తిక్కా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
Happy to announce that @ZeeMusicCompany has acquired the WORLDWIDE music rights of #MajorTheFilm
You will feel the FIRE of #MAJOR
You will feel his FURY.
You will feel his LOVE.Nothing. Will. Stop. Him.
FEBRUARY 11. Theatres. pic.twitter.com/g7gGb3ZINI
— Adivi Sesh (@AdiviSesh) November 17, 2021
అసలు సందీప్ ఎవరి స్ఫూర్తితో జీవించారు.. ఎలా మరణించారన్న అంశాలపై ఈ సినిమా నడుస్తుంది. సినిమాలోని కొన్ని సీన్లు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసేలా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలోశోబితా ధూళిపాళ్ల, సాయీ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషించారు. మహేశ్ బాబు, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తమ కెరీర్లో విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతుంటారు అడవి శేషు. ఈ సినిమాలో కూడా తన నటనతో శక్తినంతా ధారపోస్తున్నట్లు తెలుస్తోంది.