Mahesh Babu-Venkatesh: ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరు ఇటు సినిమాలను చేసుకుంటూనే, అటు బిజినెస్ లను చేస్తున్నారు.ఇక ఇప్పటికే చాలామంది హీరోలు రెస్టారెంట్లు, రిసార్ట్స్, హోటల్స్ లాంటి చాలా బిజినెస్ లను చేస్తూ ముందుకు సాగుతుంటే, మరి కొంత మంది మాత్రం పలు రకాల బిజినెస్ లను చేస్తూనే సినిమాకి రిలేటెడ్ గా ఉండే వ్యాపారాలను లను కూడా చేపడుతున్నాడు. ఇక ఇంతకుముందే మహేష్ బాబు గచ్చిబౌలిలో ‘ఏఎంబి మల్టీప్లెక్స్’ ను రూపొందించిన విషయం మనకు తెలిసిందే.
ఇక హైదరాబాద్ లోనే అత్యధిక టికెట్ రేటు కలిగి ఉన్న మల్టీ ప్లెక్స్ కూడా ఇదే కావడం విశేషం…ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మరొక థియేటర్ ను మల్టీ ఫ్లెక్స్ గా మార్చే పనిలో మహేష్ బాబు బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సుదర్శన్ థియేటర్ చాలా ఫేమస్ అని మనందరికీ తెలిసిందే.. ఇక్కడ మహేష్ బాబు, వెంకటేష్ కు సంబంధించిన సినిమాలు ఎక్కువగా ఆడుతూ ఉంటాయి. అయితే 2010 వ సంవత్సరంలో ఈ థియేటర్ మూతబడిపోవడం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు మహేష్ బాబు అలాగే వెంకటేష్ ఇద్దరూ కలిసి ఈ థియేటర్ ని మల్టీప్లెక్స్ గా మార్చబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక దీనికోసం ఏషియన్ సునీల్ కూడా వీళ్లతో చేతులు కలిపాడట. ఇక సునీల్, మహేష్ బాబు, వెంకటేష్ ముగ్గురు కలిసి ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ ని చేపడుతున్నారు. ఇక అందులో భాగంగానే ఏ ఎం బి విక్టరీ అనే పేరును కూడా దీనికి ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం మన హీరోలందరూ మల్టీ ఫ్లెక్స్ ల పైన ఎక్కువగా ఇన్వెస్ట్ మెంట్ చేయడం అనేది కొంతవరకు మంచి విషయమే…ఇక వాళ్లు సినిమాల్లో సంపాదించిన డబ్బులను సినిమాల మీదే పెడుతున్నందుకు వాళ్ళ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ, నాని లాంటి స్టార్ హీరోలు సైతం మల్టీప్లెక్స్ లను రూపొందించే పనులు బిజీగా ఉన్నారు.
ఇక అల్లు అర్జున్ సత్యం థియేటర్ ని ‘ఏషియన్ సత్యం ఏ ఏ’ గా మార్చిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కలిసి నటించిన వెంకటేష్, మహేష్ బాబు…పెద్దోడు చిన్నోడు కలిసి ఈ బిజినెస్ ను చేపట్టడం పట్ల వీళ్ళ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు…ఇక మరికొద్ది రోజుల్లో ఈ మల్టీప్లెక్స్ కి సంబంధించిన పనులను చేపట్టే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. మరి ఇది ఎప్పటికీ పూర్తయి ఎప్పుడు రెడీ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ మల్టీప్లెక్స్ లో 7 స్క్రీన్ లని సెట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది…