Balakrishna-Mahesh Babu: బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో ‘ఆహా’లోనే రికార్డ్ స్థాయిలో హిట్ అయింది. ఇప్పుడు ఆ షోకి మహేష్ బాబు ముఖ్య అతిథిగా వచ్చాడు. కాగా ఈ ఎపిసోడ్ తాలూకు ప్రోమో కూడా నిన్న రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రోమో ఫుల్ వైరల్ అవుతుంది. ముఖ్యంగా ప్రోమోలో చాలా అంశాలే హైలైట్ అయ్యాయి. మెయిన్ గా మహేష్ చేసిన కొన్ని కామెంట్స్ చాలా బాగా పేలాయి. అలాగే ఎమోషనల్ గా ప్రతి ఒక్కరినీ కదిలించింది కూడా.
మహేష్ వేలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయిస్తున్నాడు. ఆ అంశం పై ప్రోమోలో మహేష్ చెప్పిన మాటలు ఎమోషనల్ గా ఉన్నాయి. అలాగే మహేష్, వేయి మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించినట్లు బాలయ్య తెలిపారు. ఈ క్రమంలో తన కుమారుడు గౌతమ్ గురించి చెబుతూ మహేష్ ఎమోషనల్ అయ్యాడు. పైగా బాలయ్య మహేష్ ని కొన్ని తమాషా ప్రశ్నలు అడిగాడు. అంతే చమత్కారంగా మహేష్ కూడా సమాధానం చెప్పడం ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తోంది.
ఈక్రమంలోనే మహేశ్ కేబీఆర్ పార్క్‌కి ఎందుకు వెళ్లరో తెలిపాడు. అక్కడ ఓ పాము కనిపించింది అని, ఇక అప్పటి నుంచి మళ్ళీ ఆ పార్క్ సైడ్ కు వెళ్ళలేదు అని మహేష్ చెప్పిన విధానం ఫన్నీగా ఉంది. మొత్తానికి అన్ స్టాపబుల్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రోమో అదిరిపోయింది. బాలయ్యతో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేశాడు. మహేష్ తన వ్యక్తిగత జీవితం నుంచి షూటింగ్ లైఫ్ వరకు పంచుకోవడం కూడా చాలా బాగుంది. కాగా ఫిబ్రవరి 4న ‘ఆహా’లో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.
Also Read: వర్మ ‘బాలయ్య షో’ పై చేసిన ట్వీట్ ను ఎందుకు డిలీట్ చేశాడంటే.. ?
ఇక ఈ ఎపిసోడ్ లో మహేష్ మనసు విప్పి మాట్లాడాడు. అలాగే మహేష్ గతంలో ‘బసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్ కి కొంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. ఆ విషయాన్ని బాలయ్య ప్రస్తావించారు అని తెలుస్తోంది. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని బుర్రిపాలెం, మరియు సిద్దాపురం అనే రెండు గ్రామాలను తానూ దత్తత తీసుకున్నట్లు, ఆ గ్రామాల్లో తాను ఎలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టాడు లాంటి విషయాలను కూడా మహేష్ ఈ ఎపిసోడ్ లో చెప్పారట.
ఎపిసోడ్ మొత్తంలో మహేష్ – బాలయ్య మధ్య జరిగిన సంభాషణలు ఇరువురు హీరోల ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంటాయట. బాలయ్య – మహేష్ బుల్లితెరపై స్క్రీన్ స్పేస్ తో పాటు ఎమోషన్స్ ను, ఎక్స్ ప్రెషన్స్ ను కూడా షేర్ చేసుకోవడం ఆసక్తిగా ఉంటుంది. మరి ఈ ప్రత్యేక ఎపిసోడ్ కి భారీ స్థాయిలో వ్యూస్ వస్తాయని ఆహా టీమ్ నమ్మకంగా ఉంది. మరి బాలయ్య తమాషా ప్రశ్నలు.. మహేష్ చమత్కార సమాధానాలు ఎలా ఉంటాయో చూడాలి.