Sarkaru Vaari Paata Collections: సూపర్ స్టార్ ‘మహేష్ బాబు’ ‘సర్కారు వారి పాట’ కలెక్షన్స్ పై వినిపిస్తున్న టాక్ గురించి తెలిసిందే. సరే, ఆ విమర్శలు సంగతి అటు ఉంచితే.. తాజాగా ఈ సినిమా ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ వచ్చాయి. కలెక్షన్స్ బాగా పడిపోయాయి. ఈ సినిమా థియేటర్ల దగ్గర సినీ అభిమానుల తాకిడి అంతగా లేదు. చాలా చోట్ల థియేటర్లు సగం కూడా ఫుల్ అవ్వడం లేదు.

‘సర్కారు వారి పాట’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే..
నైజాం 31.28 కోట్లు
సీడెడ్ 10.40 కోట్లు
ఉత్తరాంధ్ర 10.50 కోట్లు
ఈస్ట్ 7.80 కోట్లు
వెస్ట్ 4.75 కోట్లు
గుంటూరు 8.10 కోట్లు
కృష్ణా 5.57 కోట్లు
నెల్లూరు 3.25 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని ఫస్ట్ వీక్ కలెక్షన్స్ గానూ 81.65 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
రెస్ట్ ఆఫ్ ఇండియా 5.68 కోట్లు
ఓవర్సీస్ 11.44 కోట్లు
మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ గానూ 98.77 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ గానూ రూ. 159:40 కోట్లను కొల్లగొట్టింది

అయితే, పైన చెప్పిన కలెక్షన్స్ అన్నీ నిర్మాతల నుంచి వచ్చిన బాక్సాఫీస్ రిపోర్ట్స్. అదనపు కలెక్షన్స్ ను నిర్మాతలు ప్రకటిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ కలెక్షన్స్ ను పూర్తిగా నమ్మలేం. ఒకవేళ నమ్మినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ అయ్యేలా లేదు. ‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఆ ఊపు కనిపించడం లేదు. నైజాంలో టికెట్ రేట్లు తగ్గాయి. అయినా జనం లేకపోవడం షాకింగ్ విషయమే. ఈ క్రమంలో రెండో వీకెండ్ బుకింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.
Recommended Videos
[…] […]
[…] […]