కరోనా వైరస్ ఎందరినో కూటికి లేనివారిగా మారుస్తోంది. వారిలో సినీ కార్మికులు కూడా ఉన్నారు. వీళ్ళకి షూటింగ్ ఉంటేగాని కడుపు నిండదు. అలాంటిది ఒక్కసారిగా నెల రోజులకు పైగా గ్యాప్ వచ్చేలా ఉంది. దాంతో తెలుగు సినీ పరిశ్రమ లోని కార్మికుల కోసం స్టార్స్, డైరెక్టర్స్ , సంగీత దర్శకులు అంతా కలిసికట్టుగా ముందుకు వస్తున్నారు. సినీ కార్మికులకు విరాళాలు ప్రకటిస్తున్నారు.
మొదట టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన 1 కోటి రూపాయలతో మొదలైన ఈ వితరణ ఇపుడు మరింత జోరుగా సాగుతోంది. మెగా స్టార్ తరవాత ఎన్ .టి. ఆర్ 25 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇపుడు మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా మేము సైతం అంటున్నారు.
తాజాగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు 70 లక్షలు విరాళం ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇపుడు సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ” కరోనా క్రైసిస్ చారిటీ ” కి తన వంతుగా 30 లక్షల రూపాయల విరాళం ప్రకటించడం జరిగింది.
మరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా అంతకు ముందు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన 1కోటి రూపాయలకు గాకుండా ఇపుడు ” కరోనా క్రైసిస్ చారిటీ “కి మరో 25 లక్షలు ఇవ్వడానికి రెడీ అయ్యాడు.
ఇక దర్శకుల్లో వి. వి. వినాయక్ 5 లక్షలు ఇవ్వగా ,సంగీత దర్శకుడు థమన్ కూడా సంగీత కళాకారులకు 5 లక్షల రూపాయలను విరాళం గా ఇవ్వడం జరిగింది. ఇదే దారిలో నటుడు అల్లరి నరేష్ 50 మంది సినీ కార్మికులకు నిర్మాతతో కలిసి ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. . వీరిని చూసి ఇంకా చాలామంది సినీ వర్కర్స్ కి విరాళం అందించడానికి ముందుకు వస్తారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.