Love Story: చైతు ‘లవ్ స్టోరీ’ మహేష్ కు బాగా కలిసొచ్చింది. కూల్ హీరో నాగచైతన్య క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ మంచి హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ ను రాబట్టి, ఫుల్ లాభాల దిశగా సాగింది. అయితే, ఈ సినిమా వల్ల హీరోకి, దర్శకుడికి ఎంతవరకు లాభం వచ్చిందో తెలియదు గానీ, సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాత్రం బాగా లాభాలు వచ్చాయి. ఈ లాభాలకు కరోనా కూడా ఒక కారణమే.

సెకండ్ వేవ్ తర్వాత మాస్ థియేటర్లకు జనం రావడానికి ఆసక్తి చూపించలేదు. సాధారణ జనం కూడా మల్టీప్లెక్స్ కు వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇక హైదరాబాద్ లో బెస్ట్ మల్టీప్లెక్స్ అంటే.. మహేష్ బాబు కట్టించిన ‘ఏఎంబీ మల్టీప్లెక్స్’నే. దాంతో ఈ మల్టీప్లెక్స్ కి ఫుల్ క్రేజ్ దక్కింది. సిటీ జనం మొత్తానికి ఈ మల్టీప్లెక్స్ గురించి తెలిసిందే.
కనీసం ఒక్క సినిమా అయినా ఇందులో చూడాలి ప్రతి ప్రేక్షకుడు ఫీల్ అయ్యాడు. ఈ క్రమంలో సెకెండ్ వేవ్ రావడం, సినిమాలకు చాలా గ్యాప్ రావడం.. కరెక్ట్ గా ఇలాంటి టైంలో ‘లవ్ స్టోరీ’ రిలీజ్ కావడం.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అంశాలు సినిమాలో ఉండటం.. దాంతో జనంలో ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది.
అందుకే , ఎక్కువమంది ‘ఏఎంబీ మల్టీప్లెక్స్’లోనే ఈ చిత్రాన్ని చూశారు. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ సినిమా మొత్తానికి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. లవ్‌స్టోరీ ‘ఏఎంబీ మల్టీప్లెక్స్’లో ఏకంగా రూ. కోటి రూపాయలు కలెక్ట్ చేసింది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న ఈ మల్టీప్లెక్స్ లో లవ్ స్టోరీ మొత్తం 251 షోలు ఆడింది. 48,233 మంది ఈ సినిమాని అక్కడ చూశారు.
దాంతో ఒక్క లవ్ స్టోరీ సినిమా కారణంగా ‘ఏఎంబీ’కి కోటి రూపాయలు వచ్చాయి. చైతు లాంటి మిడిల్ రేంజ్ హీరో కూడా ఈ ఫీట్ ను సాధించడం విశేషమే.