
టాలీవుడ్ లో ఫ్యామిలీ మెన్ గా ఉండే స్టార్లలో ముందు వరసలో ఉంటాడు మహేష్. షూటింగులతో ఎప్పుడూ బిజీగా ఉండే మహేష్.. ఏ మాత్రం వీలు చిక్కినా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటాడు. అంతేకాదు.. ఫ్యామిలీకి ఖచ్చితమైన క్వాలిటీ టైం కేటాయిస్తాడు. అవకాశం దొరికిన ప్రతిసారీ టూర్ ప్లాన్ చేస్తాడు. విదేశాల్లో రెక్కలు కట్టుకుని వాలిపోయి సందడి చేసేస్తాడు.
అంతేకాదు.. తమ ఫ్యామిలీ హాలిడే ట్రిప్.. స్పెషల్ అకేషన్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నిత్యం ఫ్యాన్స్ తో పంచుకుంటూనే ఉంటారు. మహేష్ తోపాటు వైఫ్ నమ్రత కూడా సోషల్ మీడియాలో వీరి ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. లేటెస్ట్ గా ఓ ఫొటో పోస్ట్ చేశారు నమ్రత. అందులో కూతురు సితార నిద్రముఖంతో వెళ్లి తండ్రి మహేష్ ఒడిలో నిద్రపోయింది.
తన ఒళ్లో వాలిపోయిన కూతురిని ప్రేమగా నిద్రపుచ్చుతున్నట్టు కనిపించారు మహేష్. ఈ ఫొటో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా.. మరో ఫొటో షేర్ చేశారు నమ్రత. అందులో మహేష్ తన కూతురిని హగ్ చేసుకున్నారు. ఈ ఫొటోకు ఇలా క్యాప్షన్ ఇచ్చారు నమ్రత.
ఇలాంటి హగ్గులు అనూహ్యంగా వస్తుంటాయి. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఇలాంటివి వస్తాయి. ఒకవేళ స్కూల్స్ ఓపెన్ అయితే.. ఇలాంటివి ఎప్పుడంటే అప్పుడు వస్తాయి. ఈ విషయంలో మహేష్ ఇప్పుడే రియలైజ్ అవుతున్నారు అంటూ రాసుకొచ్చింది నమ్రత. ఈ ఫొటో అభిమానులను చాలా ఆకట్టుకుంటోంది.