
సూపర్ స్టార్ మహేష్ చూస్తే యంగ్ హీరోలా కన్పిస్తారు. టాలీవుడ్లో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ ఆ తర్వాత హీరోగా మారాడు. దశాబ్దాలుగా టాలీవుడ్లో కొనసాగుతూ సూపర్ స్టార్ గా ఎదిగాడు. అయితే మహేష్ వయస్సు రోజురోజుకు పెరగాల్సింది పోయి తగ్గుతున్నట్లుగా కన్పిస్తుంది. మహేష్ బాబు ఇటీవల తన కుమారుడు, కుమార్తెతో సరదాగా గడిపిన ఫొటోలు చూస్తే ఆ విషయం ఇట్టే అద్ధమైపోతుంది. మహేష్ యంగ్ హీరోలకు పోటీ అన్నది పక్కన పెడితే తన కుమారుడు గౌతమ్ కు కూడా పోటీ ఇస్తున్నాడు. గ్లామర్, హైట్ విషయంలోనూ మహేష్ బాబు తన కుమారుడితో పోటీ పడుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను మహేష్ బాబు స్వయంగా తన ఇన్ స్ట్రా పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
దేశంలో లాక్డౌన్ కారణంగా షూటింగులన్నీ వాయిదా పడ్డాయి. దీంతో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. మహేష్ బాబు ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. ఆయనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని నమ్రత సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తుంటోంది. ఇటీవల మహేష్ బాబుతో నమ్రత ఆడిన రోమాంటిక్ గేమ్ వీడియోను ఇన్ స్ట్రాలో పోస్టు చేసి ఆకట్టుకుంది. తాజాగా మహేశ్ బాబు తన ఇన్ స్ట్రాలో తన తనయుడు గౌతమ్‌తో హైట్ చెక్ చేసుకుంటున్న వీడియోను పోస్టు చేశాడు. ఇందులో గౌతమ్, మహేష్ బాబు ఎదురుగా నిల్చుని ఫన్నీగా హైట్ కొలుచుకుంటారు. ‘హైట్ చెక్.. హి ఈజ్ టాల్, లాక్‌డౌన్లో కొంచెం ఫన్నీగా..’ అంటూ మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్ జోడించాడు. ఈ వీడియో చూసిన వారంతా మహేష్ కుమారుడు అప్పుడే అంత పెద్దవాడయ్యాడా? అని అవాక్కవుతున్నారు. మహేష్ బాబుకు తన హైట్ ఉన్న కొడుకు ఉన్నాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాగా మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఓ కొత్త మూవీని ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పర్శురాం దర్శకత్వంలో తెరకెక్కే ఈ మూవీ మే 31న ప్రారంభం కానుందని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది.