Sarkaru Vaari Paata: “మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందని” మనకొక సామెత ఉంది. ఒక కుటుంబ విషయంలోనే కాదు, సినిమాల రిలీజ్ విషయంలోనూ ఇది బాగా పని చేస్తుంది. 2022 సంక్రాంతి సీజన్ కోసం పెద్ద సినిమాలు పోటీకి సిద్ధం అయ్యాయి. ఆ పోటీలో ఎవరు విజేత ? ఎవరు బాధితులు ? అనే విషయం పక్కన పెడితే.. పోటీ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మంచిది కాదు.

అయినా ఎప్పుడో ముందుగానే రిలీజ్ డేట్ ను జనవరి 13వ తేదీ అంటూ గ్రాండ్ గా ప్రకటించి కూడా మహేష్ వెనక్కి తగ్గాడు. తన “సర్కారు వారి పాట” రిలీజ్ ను ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసుకున్నాడు. ఎలాగూ సంక్రాంతి రేసులో “ఆర్ఆర్ఆర్ ఉంది. పైగా ఆ తర్వాత వారం రాధే శ్యామ్ కూడా రంగంలోకి దిగుతుంది. మధ్యలో నేను ఉన్నాను అంటూ ‘బంగార్రాజు’ రాబోతున్నాడు.
ఇక భీమ్లా నాయక్ ఎలాగూ పోటీకి సై అంటున్నాడు. అందుకే మహేష్ సైలెంట్ గా రేసు నుంచి తప్పుకున్నాడని అందరూ అనుకున్నారు. కానీ అసలు సంగతి వేరే ఉంది. టిక్కెట్ల పెంపుదల విషయంలో ఏపీ సర్కార్, సినీ ఇండస్ట్రీకి సహకరించదన్న భావన మహేష్ కి ముందు నుంచి ఉందట. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం ప్రధాన టార్గెట్ పవన్ కళ్యాణ్ సినిమాలు.
Also Read: చివరి దశకు చేరిన సర్కారు వారి పాట షూటింగ్… లాస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే ?
తన సినిమాతో పాటు భీమ్లా నాయక్ చిత్రం కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి.. కచ్చితంగా జగన్ ప్రభుత్వం సినిమాల టికెట్ల పై, అలాగే షోల సంఖ్య పై కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. అలా తీసుకున్నప్పుడు తన ‘సర్కారు వారి పాట’ సినిమాకు కూడా ఆ నిర్ణయాలు వర్తిసాయి. అప్పుడు తన సినిమాకి కలెక్షన్స్ భారీగా తగ్గుతాయి. అందుకే, మహేష్ తెలివిగా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాడు.
Also Read: ‘సంక్రాంతి’ సినిమాల హోరు.. మొదలైంది బెట్టింగ్ జోరు
ఇక “భీమ్లా నాయక్” జనవరి 12వ తేదీన తమ సినిమా విడుదల అని ప్రకటించింది. మరి చెప్పిన తేదీకే తన సినిమాని పవన్ విడుదల చేస్తాడా ? లేక, రిలీజ్ ను పోస్ట్ ఫోన్ చేస్తాడా ? అన్న దాని పై ప్రస్తుతం స్పష్టత లేదు. కానీ మహేష్ మాత్రం, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యే వీక్ లో మాత్రం తన సినిమాను ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యాడు. మొత్తానికి మహేష్ తెలివి ముందు ఏ స్టార్ హీరో సరిపోడు !