Mahesh Babu: ‘రాజకుమారుడు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు… మొదటి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో ఏమాత్రం తన సత్తా చూపించలేకపోయాడు. ఇక రాజకుమారుడు సినిమా చేస్తున్న సందర్భంలోనే అతనికి ప్రకాష్ రాజ్ తో చాలా మంచి సన్నిహిత సంబంధం ఏర్పడింది. దానివల్ల తన ప్రతి సినిమాలో ప్రకాష్ రాజ్ ఉంటే బాగుంటుందని మహేష్ బాబు ఆయా దర్శకులతో అతన్ని పెట్టుకోమని చెప్పేవారట. అందుకే మహేష్ బాబు కెరియర్ స్టార్టింగ్ లో చేసిన ప్రతి సినిమాలో ప్రకాష్ రాజ్ ఉన్నాడు. మహేష్ బాబు చేసిన సూపర్ హిట్ సినిమాలన్నింటిలో ప్రకాష్ రాజ్ కీలకపాత్ర పోషించడం విశేషం…
మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మేన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాల్లో తను నటించి మెప్పించాడు… ఈ సినిమాలన్నింటిలో మహేష్ బాబు యాక్టింగ్ ఒకెత్తయితే యాక్టింగ్ మరొక ఎత్తుగా మారింది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న సినిమాల్లో కూడా ప్రకాష్ రాజ్ నటించే అవకాశం దొరుకుతుంది. మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ కి చాలా మంచి గుర్తింపైతే వచ్చింది.
మహేష్ బాబుకి ఆపోజిట్ విలన్ గా నాన్నగా, మామ గా చాలా వైవిద్య భరితమైన పాత్రల్లో ప్రకాష్ రాజు నటించి మెప్పించడం అనేది మామూలు విషయం కాదు. వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ కుదిరింది. వీళ్ళ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది… అందువల్లే వీళ్ళకి చాలా మంచి డిమాండ్ ఉంది. ఇక తనకి కో ఆర్టిస్ట్ గా ప్రకాష్ రాజ్ ఉంటే బాగుంటుందని మహేష్ అనుకునేవాడట…
ఏది ఏమైనా కూడా ప్రకాష్ రాజ్ విలక్షణమైన నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. అలాగే మహేష్ బాబు తన సినిమాల్లో ప్రకాష్ రాజ్ కి అవకాశం ఇవ్వడం అనేది కూడా చాలా మంచి విషయమని ప్రకాశ్ రాజ్ సైతం గతంలో కొన్ని సందర్భాల్లో తెలియజేయడం విశేషం… చూడాలి మరి రాబోయే సినిమాల్లో కూడా వీళ్ళు కలిసి నటిస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
