Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకి తన అన్నయ్య ‘రమేష్ బాబు’ అంటే చాలా ప్రేమ, అలాగే చాలా గౌరవం. చిన్న తనంలో తనకు తోడుగా ఉంటూ.. తనకు కావాల్సినవన్నీ కొనిచ్చాడని మహేష్ గతంలో ఎన్నోసార్లు చెప్పుకుని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలాంటి అన్నయ్య ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. అందుకే, మహేష్ ప్రస్తుతం తీవ్ర బాధలో మునిపోయాడు. ఆ బాధను వ్యక్తపరుస్తూ తాజాగా ఓకే ట్వీట్ పెట్టాడు.

తన అన్నయ్యను ఉద్దేశించి మహేష్ బాబు సోషల్ మీడియాలో మెసేజ్ చేస్తూ.. “అన్నయ్య.. నాకు స్ఫూర్తి నువ్వే. నువ్వే నాకు అండ. నిన్ను చూసుకునే నేను ఎంతో ధైర్యంగా ఉండేవాడిని, ఇప్పటికీ ఉన్నాను. నువ్వే నా సర్వస్వం. నువ్వు నా జీవితంలో లేకపోతే ఇవాళ నేనున్న స్థాయిలో సగం కూడా ఉండేవాడ్ని కాదు. నా కోసం నువ్వు చేసిన ప్రతి పనికి ఎంతో కృతజ్ఞతలు.
అన్నయ్య ఈ జన్మలోనే కాదు, నాకు మరో జన్మంటూ ఉంటే.. నువ్వే నాకు అన్నయ్యగా పుట్టాలి. ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను… ఎప్పటికీ అన్నయ్య! అన్నయ్యా… విశ్రాంతి తీసుకో, విశ్రాంతి తీసుకో’ అంటూ మహేష్ బాబు తీవ్ర భావోద్వేగంతో ట్వీట్ చేశాడు. మహేష్ మొదటి నుంచి వెరీ ఎమోషనల్ పర్సన్. ఫ్యామిలీ మెంబర్స్ కు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు.
అలాంటిది తనలో సగం అయిన తన అన్నయ్య చనిపోతే.. తాను స్వయంగా వెళ్లి చూడటానికి కూడా అవకాశం లేకపోవడం, మహేష్ ని చాలా బాగా బాధించింది. రమేష్ బాబు మరణంతో తీవ్ర విషాదానికి లోనయ్యాడు మహేష్ బాబు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలోనే తన అన్నయ్య చనిపోవడం తాను చేసుకున్న పాపం అంటూ ఇది తన దురదృష్టం అంటూ మహేష్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Rajendra Prasad: షాకింగ్ : రాజేంద్ర ప్రసాద్ కి కూడా కరోనా !
ప్రస్తుతం మహేష్ బాబు ఐసోలేషన్ లో ఉన్నాడు. వీడియో కాల్ ద్వారానే తన అన్నయ్యను కడసారి చూపులు చూసుకున్నాడు. మహేష్ తో పాటు సూపర్ స్టార్ కృష్ణ కూడా తీరని వేదనతో కుమిలిపోతూ కన్నీళ్లు పెట్టుకోవడం అందర్నీ కలిచివేసింది.
Also Read: Mahesh Babu: మహేష్ నుంచే థమన్ కి కరోనా.. ఆందోళనలో కీర్తి సురేష్, పరుశురామ్ !
— Mahesh Babu (@urstrulyMahesh) January 9, 2022