Mahesh Babu – Pawan Kalyan: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో లేటెస్ట్ గా ఫ్రాంచైజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తుంది..బాహుబలి , KGF, కార్తికేయ సిరీస్ లు సంచలన విజయం సాధించేలోపు ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ అలా సిరీస్ ని తీసే ఆలోచనలో పడిపోయారు..అతి త్వరలోనే #RRR పార్ట్ 2 , పుష్ప పార్ట్ 2 వంటి క్రేజీ మూవీస్ కూడా మన ముందుకు రాబోతున్నాయి..ఇక 2020 ఫిబ్రవరి నెలలో సరిగ్గా జనతా కర్ఫ్యూ విధించిన సమయం లో విడుదలైన విశ్వక్ సేన్ హిట్ సినిమా మంచి సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాకి న్యాచురల్ స్టార్ నానీ నిర్మాతగా వ్యవహరించాడు..ఇక ఆ తర్వాత హిట్ పార్ట్ 2 అడవి శేష్ తో తీసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేసాడు..ఈ సినిమాకి కూడా మొదటి ఆట నుండే రెస్పాన్స్ అదిరిపోయింది..కల్లెక్షన్స్ దుమ్ము దులిపేస్తూ అడవి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలవబోతుంది.
అయితే ఈ హిట్ ఫ్రాంచైజ్ కేవలం రెండు పార్టులతో ముగిసేది కాదట..మొత్తం 7 పార్టులు ఉంటాయట..మూడవ పార్టులో హీరో గా న్యాచురల్ స్టార్ నానీ నటించబోతున్నాడు..ఇక రాబొయ్యే హిట్ ఫ్రాంచైజ్ లో కూడా పెద్ద హీరోలు నటించే అవకాశం ఉందని సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం అవుతుంది..నాల్గవ పార్టు లో మాస్ మహా రాజా రవితేజ హీరో గా నటించబోతున్నాడట.

అంతే కాకుండా 5 వ పార్టులో మహేష్ బాబు..6 వ పార్టులో పవన్ కళ్యాణ్ కూడా నటిస్తారనే టాక్ గట్టిగా సాగుతుంది..ఇక చివరి 7 వ భాగం లో వీళ్ళందరూ కలిసి ఒక్క అతి పెద్ద కేసు ని పరిష్కరిస్తారని..హిట్ ఫ్రాంచైజ్ రాబొయ్యే రోజుల్లో అతి పెద్ద ఇండియన్ ఫ్రాంచైజ్ గా ఉండబోతుందని ఒక టాక్ గట్టిగా వినిపిస్తుంది..మరి ఇందులో ఎంతవరుకు నిజం ఉందొ చూడాలి..ఈ 7 సినిమాలను న్యాచురల్ స్టార్ నానీ తన సొంత నిర్మాణ సంస్థలోనే తెరకెక్కిస్తాడట.