https://oktelugu.com/

Mahesh Babu: ‘కేజీఎఫ్ 2’ మ‌హేష్ కు న‌చ్చ‌లేదా ? అందుకే మౌనంగా ఉన్నాడు ?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకి స్పందించే గుణం ఎక్కువ. నచ్చిన సినిమాను వీక్షించి.. ఆ సినిమా పై తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా తెలియచేయడం ఈ మధ్య మహేష్ బాగా అలవాటు చేసుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పై కూడా స్పందిస్తూ.. ‘ఈ సినిమా ఒక E.P.I.C. ‘గ్రాండ్ విజువల్స్ తో అద్భుతంగా ఉంది. కేవలం మాస్టర్ స్టోరీ టెల్లర్ మాత్రమే ఇది చేయగలడు. ఒక్క రాజమౌళి మాత్రమే ఇలా సినిమా తీయగలడు’ అంటూ పొగడ్తల వర్షం […]

Written By:
  • Shiva
  • , Updated On : April 26, 2022 / 12:12 PM IST
    Follow us on

    Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకి స్పందించే గుణం ఎక్కువ. నచ్చిన సినిమాను వీక్షించి.. ఆ సినిమా పై తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా తెలియచేయడం ఈ మధ్య మహేష్ బాగా అలవాటు చేసుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పై కూడా స్పందిస్తూ.. ‘ఈ సినిమా ఒక E.P.I.C. ‘గ్రాండ్ విజువల్స్ తో అద్భుతంగా ఉంది. కేవలం మాస్టర్ స్టోరీ టెల్లర్ మాత్రమే ఇది చేయగలడు. ఒక్క రాజమౌళి మాత్రమే ఇలా సినిమా తీయగలడు’ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు.

    Mahesh Babu

    అయితే ‘కేజీఎఫ్ 2’ విష‌యంలో కూడా మ‌హేష్ నుంచి ఇలాంటి స్పందనే ఉంటుందని అంతా భావించారు. కానీ, అది జరగలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు మహేష్, ‘కేజీఎఫ్ 2’ పై స్పందించ‌లేదు. ‘కేజీఎఫ్ 2’ సినిమా ఘన విజయం సాధించింది. అయినా మహేష్ ఎందుకు మౌనంగా ఉన్నాడు ?, ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. బహుశా ఈ సినిమా మహేష్‌కి నచ్చలేదు అని టాక్ నడుస్తోంది.

    Also Read: Bigg Boss Nonstop Telugu: క్లోజ్ ఫ్రెండ్స్ మ‌ధ్య వార్‌.. శివ‌ను నామినేట్ చేసిన బిందు.. ఒంట‌రిని చేస్తున్నారా..?

    సినిమా నచ్చకపోవడంతోనే మహేష్, ‘కేజీఎఫ్ 2’ గురించి ఎలాంటి ట్వీట్‌ చేయలేదని సోషల్‌ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఐతే, సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘సర్కారు వారి పాట’తో మహేష్ ఫుల్ బిజీగా ఉన్నాడని, అందుకే.. మహేష్ కి ‘కేజీఎఫ్ 2’ సినిమా చూసే అవకాశం రాలేదని.. కాబట్టే.. ‘కేజీఎఫ్ 2’ పై మహేష్ ఎలాంటి ట్వీట్ చేయలేదని అంటున్నారు.

    కానీ, మహేష్ ‘ఆర్ఆర్ఆర్’తో పాటు పుష్ప గురించి ట్వీట్ చేసి అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. ఇక మహేష్ ప్రస్తుతం హీరోగా వస్తున్న ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ మొన్న విడుదలైంది. చెప్పినట్టుగానే ఈ పాట రికార్డుల మోత మోగిస్తోంది. ‘సరా సరా సర్కారు వారి పాట… షురూ షురూ అన్నాడురా అల్లూరి వారి బేటా…’ అంటూ సాగిన ఈ టైటిల్ సాంగ్ చాలా బాగా ఆక‌ట్టుకుంటోంది.

    KGF 2

    మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్.త‌మ‌న్ అందించిన ట్యూన్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లో సాగింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.
    ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు సాగిన ఈ పాటకు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వచ్చింది. కాగా ఈ సినిమా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ సాగుతుంది. మైత్రీ – 14 రీల్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

    Also Read:Megastar Chiranjeevi: ఏండ్ల క్రిత‌మే పాన్ ఇండియా మూవీ చేసిన మెగాస్టార్‌.. బ‌డ్జెట్ ఎంతంటే..?

    Recommended Videos:

    Tags